- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆసియా కప్ రద్దు..?
ఆసియా క్రికెట్ మండలి నిర్వహించే ఆసియా కప్ – 2020 ఈ ఏడాది జరగడం అసాధ్యంగానే కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీ సెప్టెంబర్‌లో జరగాల్సి ఉండగా.. ఆతిథ్య దేశమైన పాకిస్తాన్.. ప్రస్తుతం ఈ టోర్నీ రద్దుకే మొగ్గు చూపుతోంది. ఆసియా కప్ పాకిస్తాన్ లో నిర్వహిస్తే మా జట్టును పంపించబోమని బీసీసీఐ తెగేసి చెప్పడంతో పీసీబీ మండిపడిన విషయం తెలిసిందే. కాగా, చివరకు టోర్నీని యూఏఈకి మార్చడానికి పీసీబీ ఒప్పుకుంది. సెప్టెంబర్‌లో ఆసియా కప్ నిర్వహించడానికి ప్రాథమిక షెడ్యూల్ కూడా తయారైంది. అయితే, పీసీబీ చైర్మన్ ఇషాన్ మణి మాత్రం ఆసియాకప్ జరగడం సందేహమే అని చెబుతున్నారు. ‘ప్రపంచం మొత్తం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సెప్టెంబర్ నాటికి ఎలాంటి పరిస్థితులుంటాయో చెప్పలేం. అయితే టోర్నీ రద్దుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం’ అని ఇషాన్ మణి అన్నారు.
Tags: PCB Chairman, Asia cup, BCCI, corona