హైదరాబాద్‌ చేరుకున్న రెండో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..

by Shyam |   ( Updated:2021-05-04 09:16:51.0  )
హైదరాబాద్‌ చేరుకున్న రెండో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఆక్సిజన్‌ను సురక్షితంగా, భద్రంగా, నిరాటంకంగా, సజావుగా రవాణా చేసేందుకు రైల్వేశాఖ ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్‌‌లను ప్రారంభించిందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెండో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ మంగళవారం హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌ గూడ్స్‌ కాంప్లెక్స్‌కు చేరుకుందని అన్నారు.

ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ 1,334 కిలోమీటర్ల దూరంలోని ఒడిస్సా నుంచి బయల్దేరి దాదాపు 31 గంటల్లోనే గమ్యానికి చేరుకుందన్నారు. 4 ట్యాంకర్లలో 60.23 మెట్రిక్‌ టన్నుల లిక్విడ్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ (ఎల్‌ఎమ్‌ఓ) వచ్చిందని అన్నారు. క్రయోజనిక్‌ కార్గో అయిన ఈ ట్యాంకర్లలో లిక్విడ్‌ ఆక్సిజన్‌ రవాణాకు సంబంధించి గరిష్ట వేగం, ఒత్తిడి వంటి అనేక పరిమితులను రైల్వేశాఖ పరిగణలోకి తీసుకుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు రైళ్లు నడుపబడుతున్నాయని వెల్లడించారు. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను వేగవంతంగా, నిరాటంకంగా నడపడంలో కృషి చేస్తున్న అధికారులను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్య అభినందించారు. ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను నడపడంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ తగిన చర్యలు తీసుకోవాని అన్ని డివిజన్ల అధికారులకు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed