శబరినది కూడా ఇలానే వదిలేశారు: భట్టి విక్రమార్క

by Shyam |   ( Updated:2020-05-12 07:40:23.0  )
శబరినది కూడా ఇలానే వదిలేశారు: భట్టి విక్రమార్క
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ సీఎం జగన్ పై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జలాల విషయంలో కేసీఆర్ గతంలో కూడా ఇలాగే చేశారంటూ ఫైరయ్యారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు జీవో విడుదల సీఎం కేసీఆర్‌కు తెలియకుండా చేయడమనే విషయం నమ్మసక్యమైనది కాదన్నారు. కేసీఆర్ ఆర్థికపరమైన లావాదేవీల కోసం రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదన్నారు. గతంలో శబరినది విషయంలో కూడా ఇలానే చేశారని గుర్తుచేశారు. ఖమ్మం జిల్లా ప్రాంతానికి సాగునీటి కోసం శబరినది ఇందిరా సాగర్ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేస్తే కేసీఆర్ సీఎం అయ్యాక ఆ ప్రాజెక్టును ముట్టుకోలేదంటూ మండిపడ్డారు. కేసీఆర్, జగన్‌లు అన్నదమ్ములైతే వాళ్ల ఇంటి వ్యవహారం వరకే చూసుకోవాలని, రాష్ట్ర సంపదను దోచిపెడతామంటే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.

ఏపీ ప్రభుత్వం జీవో విడదల చేస్తుంటే తెలంగాణ ఇంటెలిజెన్స్ ఏమీ చేస్తుందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ మాట్లాడుకొని చేసిన పనికాదని గ్యారంటీ ఏమీటని తెలంగాణ ప్రభుత్వాన్ని నీలదీశారు. నదీజలాల పంపకాల విషయం అపెక్స్ కమిటీ బోర్డు‌లో చర్చించకుండా జీవో విడదల చేసిందా..? అని అనుమానం వ్యక్తం చేశారు. 90 శాతం పూర్తి అయిన ప్రాజెక్టులను కేసీఆర్ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రీడిజైన్‌తో ప్రజల సొమ్ము దోచుకుంటున్నారన్నారు. 10 టీఎంసీలతో మొదలైన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను రెండు టీఎంసీలకు చేసి తీరా ఒకటికి తగ్గించారన్నారు. తెలంగాణ రాష్ట్రం పోతిరెడ్డిపాడు సామర్థ్యం తగ్గిస్తే, ఏపీ ప్రభుత్వం పెంచుతుందన్నారు. ఆనాడు పోతిరెడ్డిపాడు కోసం రక్తం మరిగిపోతుందన్నా కేసీఆర్ ఇవాళ సీఎంగా ఎలా మరుగాలని ఎద్దేవా చేశారు.

Advertisement

Next Story

Most Viewed