తీగల అనితారెడ్డికి షాక్.. నేలపై కూర్చొని జడ్పీటీసీ నిరసన

by Shyam |   ( Updated:2021-10-03 08:14:18.0  )
Kandukur ZPTC Jangareddy
X

దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా పరిషత్ నిధుల కేటాయింపులో చైర్ పర్సన్ తీగల అనితారెడ్డి వివక్ష చూపిస్తోందని అధికార పార్టీకి చెందిన కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి, బీజేపీకి చెందిన యాచారం ఎంపీపీ సుకన్యలు సర్వసభ సమావేశంలో నేలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ లక్డికాపూల్‌లోని రంగారెడ్డి జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం జడ్పీ చైర్ పర్సన్ అనితారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో అధికార పార్టీకి చెందిన కందుకూరు జడ్పీటీసీ జంగారెడ్డి నిరసన గళం వినిపించడంతో సభ ఉద్రిక్తంగా మారింది.

మంత్రి సబితా ఇంద్రారెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఏక వచనంతో మాట్లాడటం బాధ కలిగించిదని జడ్పీటీసీ జంగారెడ్డి సభను వాకౌట్ చేసి వెళ్లిపోయారు. అనంతరం యాచారం ఎంపీపీ చేసిన డిమాండ్లకు చైర్ పర్సన్ సానుకూలంగా స్పందించారు. అలాగే యాచారం ఎంపీడీఓను బదిలీ చేయాలని ఎంపీపీ కోరగా మంత్రి సానుకూలంగా స్పందించారు. మాటలతో సర్వసభ్య సమావేశం కాసేపు గందరగోళం నెలకొంది.

Advertisement

Next Story

Most Viewed