- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘హత్రాస్’లో అధికారుల పాత్ర స్పష్టం
న్యూఢిల్లీ: హత్రాస్ కేసులో అధికారుల ప్రమేయం స్పష్టంగా ఉన్నదని, నిజాన్ని వారు ఎంతోకాలం తొక్కిపెట్టలేరని బాధిత కుటుంబ సభ్యులు అన్నారు. ఈ కేసులో సీబీఐ చార్జిషీటు శుక్రవారం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చార్జిషీటు దాఖలుకు సంబంధించి తమ తల్లిదండ్రులకు తెలియజేయలేదని, అందులో తాము చెప్పినదేమీ లేదని హత్రాస్ బాధితురాలి సోదరుడు తెలిపారు. కాబట్టి, చార్జిషీటు నుంచి తాము పెద్దగా ఆశించడం లేదని, అయితే, అదేం చెబుతుందో చూడాలనుకుంటున్నామని అన్నారు. ఇప్పుడే న్యాయపోరాటం మొదలైందని, ప్రభుత్వం తాము చెప్పినవాటిని విశ్వసించలేదని వివరించారు.
ఘటన జరిగినప్పటి నుంచి గ్రామస్తులు, ఇరుగుపొరుగు, జిల్లా కలెక్టరూ తమకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నారని, తమ సోదరిని తామే చంపేశామని ఆరోపిస్తున్నారని వాపోయారు. ఊరికీ చెడ్డపేరు తెచ్చారని దగ్గరికి రానివ్వడం లేదని తెలిపారు. తమకు న్యాయం కావాలని, జిల్లా మెజిస్ట్రేట్ రాజీనామా చేయాలని బాధితురాలి వదిన అన్నారు. జిల్లా మెజిస్ట్రేట్ వల్లే తాము అంతిమ సంస్కరాలు చేయలేకపోయామని ఆరోపించారు.