- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అరుణాచల్ ‘కివీ’కి ఆర్గానిక్ ట్యాగ్
దిశ, వెబ్‌డెస్క్ : పాండమిక్ టైమ్‌లో అనే కాదు, డెంగ్యూ జ్వరాలు విపరీతంగా ప్రబలినప్పుడు కూడా ఎక్కువగా తినాలని వైద్యులు సూచించిన పండు ‘కివీ ఫ్రూట్’. ఇవి న్యూజిలాండ్‌లోని శీతల ప్రాంతాల్లో ఎక్కువగా పండుతాయన్న విషయం తెలిసిందే. పేరు కూడా ‘కివీ’ అని ఉండటంతో, ఇది న్యూజిలాండ్‌లో పుట్టిన పండేనని భావించినా, నిజానికి కివీ మాత్రం తూర్పు చైనాలో పుట్టింది. విదేశాల్లో ఎక్కువగా అడవులు, పర్వతాలు, కొండ ప్రాంతాల్లో సాగయ్యే ‘కివీ’ ఫ్రూట్‌ను ఇండియాలో మాత్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొండప్రాంత రైతులు పండిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ పండించే కివీకి ‘ఆర్గానిక్ సర్టిఫికేషన్’ పొందడం విశేషం. మరి అరుణాచల్ రైతులకు కాసులు కురిపిస్తున్న కివీ సాగు అక్కడ ఎలా మొదలైంది?
అరుణాచల్ ప్రదేశ్‌లోని జిరో వ్యాలీలో 20 సంవత్సరాల క్రితం నుంచే ‘కివీ’లు లభిస్తున్నా.. వాటిని ఎవరూ పట్టించుకోలేదు. కానీ, దశాబ్ద కాలంగా ఆ పండ్లకు ఉన్న కమర్షియల్ వాల్యూను అక్కడి రైతులు గుర్తించడంతో ప్రత్యేకించి కివీ సాగును మొదలుపెట్టారు. అందులోనూ ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తుండటంతో అరుణాచల్ కివీ పండ్లకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. మనదేశంలో ఒక పంటకు ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఇచ్చేముందు అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ(APEDA) సైంటిఫిక్ పరీక్షలన్నీ నిర్వహిస్తుంది. దాదాపు మూడేళ్ల పాటు ఆర్గానిక్ పద్ధతిలో సాగు చేసిన పంటకు మాత్రమే ఈ సర్టిఫికెట్ లభిస్తుంది. దీనివల్ల ఆ పండ్లకు ప్రీమియం ధర పలకడంతో పాటు లోకల్, రీజనల్స్ దాటి ఇంటర్నేషనల్ లెవెల్లో ఫాస్ట్ గ్రోయింగ్ మార్కెట్ ఏర్పడి రైతులకు మరింత లబ్ది చేకూరుతుంది.
‘ఎన్నో సంవత్సరాలుగా మేము కివీలను తింటున్నాం. స్థానికంగా వాటిని ‘అంటెరి’ అని పిలుస్తాం. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన కివీ పండ్లతో మా మార్కెట్లు నిండిపోయేవి, కానీ అవి మా అడవుల్లో పెరుగుతున్నట్లు మేం గుర్తించలేదు. 2000 సంవత్సరంలో ఎట్టకేలకు మా అరణ్యాల్లోని కివీ పండ్లను, కమర్షియల్ వాల్యూ ఫ్రూట్స్‌గా మార్కెట్లోకి తీసుకొచ్చాం. ప్రస్తుతం 150 మంది రైతులు ఈ పండ్లను సాగు చేస్తుండగా, ప్రతి ఏడాది 800 మెట్రిక్ టన్నుల కివీలు ఉత్పత్తి చేస్తున్నాం. జిరో వ్యాలీ సముద్ర మట్టానికి 1500-2000 మీటర్ల ఎత్తులో ఉండటంతో కివీల సాగుకు అనువుగా ఉంటుంది. మేఘాలయాకు లాకాడంగ్ టర్మరిక్, మణిపూర్‌కు బ్లాక్ రైస్ ఎలాగ.. అరుణాచల్ ప్రదేశ్ సిగ్నేచర్ క్రాప్‌గా ‘కివీ’ నిలిచింది’ అని వ్యవసాయ అధికారి ఒకిట్ పల్లింగ్ తెలిపాడు.
‘కివీ పండ్ల సాగులో మనదేశంలోనే ఆర్గానిక్ సర్టిఫికేషన్ అందుకున్న తొలి రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నిలిచింది. ఈ గుర్తింపు తీసుకొచ్చినందుకు లోయర్ సుబన్‌సిరి జిల్లా రైతులకు నా హృదయపూర్వక అభినందనలు’ అని అరుణాచల్ సీఎం పెమా ఖండు ఇటీవలే పేర్కొన్నాడు.