మర్కజ్ వెళ్లిన మత పెద్దలను గుర్తించాలి

by Shyam |
మర్కజ్ వెళ్లిన మత పెద్దలను గుర్తించాలి
X

దిశ, మేడ్చల్: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో మతపరమైన ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారిని త్వరగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ వాసం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం బాలనగర్ డీసీపీ కార్యాలయంలో కరోనా వైరస్‎పై పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్‎లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మర్కజ్‎లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లిన వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు ఉన్నారన్నారు. కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి నియోజకవర్గానికి సంబంధించిన మత పెద్దలు కూడా ఉన్నారని తెలిపారు. వారందరినీ గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించి 14 రోజుల పాటు నిర్బంధంలో ఉంచాలని పోలీసు, వైద్య అధికారులకు సూచించారు. ప్రజలు ఎవరు ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని 144 సెక్షన్ కఠినంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వెంకటేశ్వర్లు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద‎తో కలిసి మండలంలోని చంద్రగిరి నగర్‎ను సందర్శించారు. అక్కడి ప్రజలకు కరోనా వైరస్ గురించి వివరిస్తూ.. ఢిల్లీలోని ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారు స్వచ్ఛందంగా వచ్చి పోలీసులను కలవాలని, వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తామని వివరించారు.

Tags: Collector Venkateshwarlu, religious elders, Markaz, medchal

Advertisement

Next Story

Most Viewed