ఆ సమయంలో సెక్స్‌వర్కర్ల రేటు.. వందకు ఇరవైనే!

by Anukaran |   ( Updated:2021-12-06 05:57:15.0  )
sex workers
X

దిశ, ఫీచర్స్ : పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ఆశించిన ఫలితాలు నెరవేరాయా? లేదా పక్కనబెడితే.. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్య తరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులు ఎంత కష్టాన్ని ఎదుర్కొన్నారో కళ్లారా చూశాం. అలాంటి ఇబ్బందికర పరిస్థితుల నుంచి క్రమంగా బయటపడినప్పటికీ.. సెక్స్‌ వర్కర్స్ కమ్యూనిటీ మాత్రం ఇప్పటికీ కోలుకోలేదు. డీమానిటైజేషన్ జరిగి ఐదేళ్లయినా.. వారి జీవితాల్లో ఈ గందరగోళం తొలగిపోలేదు. నోట్ల రద్దు నుంచి మొదలైన నగదు కష్టాలు నేటికీ ఏదో రూపంలో వెంటాడుతున్నాయి.

డీమానిటైజేషన్ సెక్స్ వర్కర్లపై తక్షణ ప్రభావం చూపించింది. వారి బిజినెస్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. నగదు లేకపోవడంతో రాత్రికి రాత్రే కస్టమర్ల సంఖ్య తగ్గిపోగా.. రోజుకు వెయ్యి కంటే ఎక్కువ సంపాదించలేకపోయారు. దీంతో వారి రేటు కూడా తగ్గించాల్సి వచ్చి్ంది. అంతేకాదు అప్పటిదాకా పొదుపు చేసుకున్న డబ్బును బ్యాంకులో మార్చుకోకుంటే ఏం జరుగుతుందో తెలియక అయోమయానికి గురయ్యారు. పాత, కొత్త నోట్ల విషయంలో అవగాహన లేక విలువలేని కరెన్సీ వాళ్లదగ్గరే ఉండిపోగా.. నెలవారీ బిల్లులు, పాఠశాల ఫీజులు, వైద్య ఖర్చులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Dehumanization

నోట్ల మార్పిడికి 20 /100

చాలా మంది సెక్స్ వర్కర్లకు డాక్యుమెంటేషన్ లేదా బ్యాంక్ ఖాతాలు లేవు. నోట్ల రద్దు ప్రారంభమైనప్పుడు ఈ సమస్య ప్రముఖంగా ఉంది. కొవిడ్-19 సమస్యతో ఇప్పటికీ పోరాడుతున్నారు. చాలా మంది మహిళలు తమ ఇళ్లలో, వేరొకరి ఇంట్లో లేదా తెలిసినవారి బ్యాంకు ఖాతాలో నగదును డిపాజిట్ చేశారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకున్న మరికొందరు రూ.100 పాత నోటు మార్చి ఇచ్చేందుకు కూడా సెక్స్ వర్కర్ల నుంచి రూ.20 కమీషన్‌గా వసూలు చేశారు. ప్రస్తుతం వడ్డీ వ్యాపారులు సైతం సెక్స్ వర్కర్లకు ఇచ్చే రుణాలపై 10% ఎక్కువ వడ్డీని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు క్యాష్ విత్‌డ్రా, డిపాజిట్లపై బ్యాంకులు విధించిన కఠినమైన నియమాలు కూడా లిక్విడ్ మనీని పరిమిత ఆస్తిగా మార్చాయి.

ప్రైవసీ.. డిస్‌రెస్పెక్ట్..

PAN కార్డ్స్ సాధారణంగా బ్యాంక్ ఖాతాలకు లింక్ చేయబడి ఉంటాయని తెలిసిందే. ఈ మేరకు సెక్స్ వర్కర్లు తమ డబ్బును యాక్సెస్ చేయడానికి వారి అసలు పేర్లు, సమాచారాన్ని ఇవ్వాలి. కానీ ఇది వారి కమ్యూనిటీకి ప్రమాదకరం. ఎందుకంటే వారి వృత్తిని సమాజం గౌరవించదు, నేరంగా పరిగణిస్తుంది. అలాంటి వ్యక్తులు తమ అసలు వివరాలను బహిర్గతపరిస్తే వేధింపులకు గురయ్యే ప్రమాదం ఉంది. కానీ బ్యాంక్‌ విషయంలో ప్రైవసీ చెల్లదు. దీనివల్ల బ్యాంకు సేవలను పొందలేకపోయారు. ఈ సమస్యల నివారణకు చాలా మంది మహిళలు తమ డబ్బును వారి గదుల్లోనే దాచుకోగా.. డబ్బు అపహరణకు గురైన సందర్భాలు చాలా ఉన్నాయి.

sex worker

ఆన్‌లైన్ ట్రాన్జాక్షన్స్‌తో మోసం

డీమానిటైజేషన్ తర్వాత డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. సెక్స్ వర్కర్లు కూడా తప్పని పరిస్థితుల్లో ఈ తరహా చెల్లింపులను అంగీకరించాల్సి వచ్చింది. కానీ ఆన్‌లైన్ లావాదేవీల గురించి అవగాహన లేకపోవడంతో.. కస్టమర్లు ఈ వ్యూహాన్ని ఉపయోగించుకుని వారిని మోసం చేశారు. పెద్ద నోట్ల రద్దు చర్య ప్రజా సంఘాలు, సెక్స్ వర్కర్లు సురక్షితంగా పని చేయడానికి సాయపడే నెట్‌వర్క్‌లను ప్రభావితం చేసింది. రూ. 3 లక్షల నగదు లావాదేవీల పరిమితి కారణంగా ఏజెంట్ల పని చాలా పెరిగింది. ఖాతాదారులు రూ.2000 నోట్లు ఇస్తుండటంతో ఏజెంట్లు చేంజ్ చేసుకోలేకపోయారు.

వేశ్య అన్యాయ్ ముక్తి పరిషత్ పోరాటం

కాగా సెక్స్ వర్కర్ల సమస్యలపై పనిచేస్తున్న ‘వేశ్య అన్యాయ్ ముక్తి పరిషత్’.. కొన్ని సమిష్టి ప్రయత్నాల ద్వారా పెద్ద నోట్ల రద్దు నుంచి ఉత్పన్నమైన, పాండమిక్ టైమ్‌లో అధ్వానంగా మారిన కొన్ని సమస్యలను పరిష్కరించింది. కమ్యూనిటీ సభ్యులతో ఏర్పాటు చేయబడిన సహాయక్ సేతు (హెల్ప్ డెస్క్‌లు) అందులో భాగమే. నవంబర్ 2020 నుంచి 34 హెల్ప్ డెస్క్‌ల ద్వారా దాదాపు 24,414 మంది వ్యక్తులు సర్వే చేయబడ్డారు. వీరిలో 1,500 మందికి సంక్షేమ పథకాలు, పౌరసత్వ పత్రాలు పొందడంలో సాయమందించింది. క్షేత్రస్థాయిలో సభ్యుల ఆర్థిక, సామాజిక పరిస్థితిని పరిష్కరించేందుకు కమ్యూనిటీ-నేతృత్వంలో నిరంతరం పని చేస్తోంది.

NNSW

ఆ సమయంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం

మా పిల్లల చదువుల కోసం ఫీజులు చెల్లించడంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాం. పెద్దనోట్ల రద్దు నుంచి ప్రజల వద్ద ఇంతకు ముందు ఉన్నంత డబ్బు లేదని నేను భావిస్తున్నా. ఇంతకుముందు వడ్డీ వ్యాపారులు ఎటువంటి షూరిటీ లేకుండా డబ్బు ఇచ్చేవారు. కానీ డీమానిటైజేషన్ తర్వాత కొంత సెక్యూరిటీ డిపాజిట్లను ఉంచారు. సెక్స్ వర్కర్లకు వారి పని ప్రదేశాల్లో భద్రత లేకపోవడం కూడా మరో సమస్య. వృత్తిలో భాగంగా తెలియని కస్టమర్లతో వ్యవహరించాల్సి రావడంతో దోపిడీలు కూడా ఎక్కువయ్యాయి
– అయేషా రాయ్, నేషనల్ నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ కోఆర్డినేటర్, వేశ్య అన్యాయ్ ముక్తి పరిషత్ సభ్యురాలు

Advertisement

Next Story