వీడు మనిషేనా.. చెల్లిని కూడా వదలకుండా మూడునెలలుగా..

by Anukaran |   ( Updated:2021-11-28 22:54:20.0  )
gang rape news
X

దిశ, వెబ్‌డెస్క్ : ప్రస్తుత సమాజంలో మహిళలపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వావి వరసలు మరచి పసికందు నుంచి పండు ముసలమ్మ వరకు ఎవరినీ వదలడం లేదు కామాంధులు. మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా దాడులు మాత్రం ఆగడం లేదు అనడానికి అనేక సంఘటనలు నిదర్శనం. వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్నైతే వెలుగులోకి రాక, మానసికంగా నలిగిపోతున్న మహిళలెందరో. తాజాగా సొంత చెల్లిపై అన్న లైంగిక దాడి చేసిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. మహిళ గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్లితే.. చిన్న వయసులోనే తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు అన్నలతో 16 ఏళ్ల బాలిక రాష్ట్రంలోని మైసూరు గిరి దర్శని నగరంలో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో అన్న వినయ్ కుమార్ మద్యానికి బానిసై వావి వరసలు మరచి సొంత చెల్లిపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం బయటపడింది. దీంతో రెండో అన్నయ్యకు విషయాన్ని చెప్పడంతో అతను పోలీసులు ఫిర్యాదు చేశాడు. రెండో అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Advertisement

Next Story