బ్లాక్ ఫంగస్ ఓ అంటువ్యాధి.. డేంజర్ అంటున్న ప్రభుత్వం

by Anukaran |   ( Updated:2021-05-19 06:20:29.0  )
బ్లాక్ ఫంగస్ ఓ అంటువ్యాధి.. డేంజర్ అంటున్న ప్రభుత్వం
X

జైపూర్: కరోనా నుంచి రికవరీ అయినవారిలో ఎక్కువగా కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్(మ్యూకోర్మైకోసిస్) అంటువ్యాధి అని రాజస్థాన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 100 బ్లాక్ ఫంగస్ కేసులున్నాయి. వీరి చికిత్స కోసం జైపూర్‌లోని సవాయి మాన్ సింగ్(ఎస్ఎంఎస్) హాస్పిటల్‌లో ప్రత్యేక వార్డునే కేటాయించారు. రాజస్థాన్ ప్రభుత్వం బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా(ఎపిడెమిక్) ప్రకటించింది. రాజస్థాన్ అంటువ్యాధుల చట్టం 2020 కింద నోటిఫే చేసే డిసీజ్‌గా రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అఖిల్ అరోరా ఓ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్, బ్లాక్ ఫంగస్‌ల చికిత్సను సమన్వయం చేయడానికి తగిన చర్యలు తీసుకుంటామని వివరించారు. సాధారణంగా డయాబెటిస్ పేషెంట్లు బ్లాక్ ఫంగస్ బారినపడే ముప్పు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed