నెల ముందు నుంచే మీరు చేసుకోవొచ్చు

by Shamantha N |
నెల ముందు నుంచే మీరు చేసుకోవొచ్చు
X

దిశ, వెబ్ డెస్క్: రైల్వే శాఖ ఓ ప్రకటన చేసింది. ఇక నుంచి రాజధాని రైళ్లలో ప్రయాణం చేసేందుకు నెల రోజుల ముందు నుంచే అడ్వాన్స్ రిజర్వేషన్లను బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించిన టికెట్లు నెల ముందు నుంచే రైల్వేస్టేషన్లలోని రిజర్వేషన్ కౌంటర్లలో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నది. తత్కాల్ బుకింగ్ కు, వెయిటింగ్ లిస్ట్ లోని వారు ప్రయాణించడానికి అనుమతి లేదు. అయితే.. రైలు ప్రారంభమయ్యే 4 గంటల ముందు ప్రయాణికుల తొలి జాబితాను, 2 గంటల ముందు రెండో జాబితాను సిద్ధం చేయనున్నది. ఈ రెండు జాబితాలను సిద్ధం చేసే క్రమంలో కరెంట్ బుకింగ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కామన్ సర్వీస్ సెంటర్లు, యాత్రి టికెట్ సువిధ కేంద్రాలు, ఐఆర్ సీటీసీ అధీకృత ఏజెంట్లు, పోస్టాఫీసులు, కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ కౌంటర్లు ద్వారా టికెట్లను బుక్ చేసుకునేందుకు ఈసారి అవకాశం కల్పించింది.

Advertisement

Next Story