- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డెంగ్యూ టెస్ట్‌కు రూ.1500.. ఏజెన్సీలో రెచ్చిపోతున్న మెడికల్ మాఫియా..
దిశ, గుండాల : గుండాల అల్లపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో విచ్చలవిడిగా మెడికల్ మాఫియా కొనసాగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రతి సంవత్సరం సీజనల్ వ్యాధులు రావడం మామూలే. సీజనల్ వ్యాధులను ఆసరాగా చేసుకొని జ్వర పీడితులను భయబ్రాంతులకు గురి చేస్తూ.. మెడికల్ షాపు, ల్యాబ్‌లు అధిక ధరలు ఫిక్స్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. జ్వరానికి ల్యాబ్‌లో టెస్ట్ చేస్తే 15 వందలు తీసుకుంటూ, జిల్లా కేంద్రంలో చేయాల్సిన డెంగ్యూ టెస్ట్‌లు మండల కేంద్రంలో చేస్తున్నారు.
అంతేకాకుండా ‘మీకు డెంగ్యూ వచ్చింది.. ఇలానే ఉంటే ప్రమాదం.. వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లండి’ అని ల్యాబ్ యజమానులు ఒక్కొక్క రోగి దగ్గర రూ.1500 నుండి రూ.3,000 వరకు వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే వైద్యులు వైద్యం పేరుతో రూ. 12,000 వరకు వసూలు చేస్తున్నారని ఆదివాసులు ఆరోపిస్తున్నారు. ఇక మెడికల్ షాప్ లో ఎంఆర్‌పీ (MRP) ధరకంటే అధికంగా డబ్బులు వసూలు చేస్తూ, నకిలీ మందులు విక్రయిస్తున్నారని, మెడికల్ షాప్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సీజనల్ వ్యాధులు కాలంలో ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని టెస్ట్‌లు, ముందుల పేరిట దోపిడీ చేస్తున్నారని వాపోతున్నారు. ఎలాంటి అనుమతి లేకుండా ఏజెన్సీ లో కొనసాగుతున్న మెడికల్ షాపులు, ల్యాబ్‌లపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.