- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపుగా పెరిగి.. వానకు ఒరిగి!
దిశ, మెదక్: జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు తీరని నష్టాన్ని మిగిల్చింది. రబీ సేద్యంలో భాగంగా ఏపుగా పెరిగి కోతకు వచ్చిన చేలు అకాల వర్షంతో నేలనంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో నూర్పిళ్లు జరుగుతుండగా కురిసిన వర్షం వల్ల ధాన్యం రాశులు తడిసి ముద్దయ్యాయి. ఆకస్మికంగా ఈదురుగాలులతో వచ్చిన వర్షం రైతులకు ఎనలేని కష్టాలను తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ తరుణంలో నూర్పిళ్లు చేసుకునేందుకు రైతులు సిద్ధమైనప్పటికీ అందుకు అవసరమైన సాంకేతిక సామగ్రి అందుబాటులో లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.
అత్యధికం..
జిల్లాలో 2 .64 లక్షల హెక్టార్లలో వరిని సాగు చేశారు. ఇప్పటికే 80 వేల హెక్టార్ల విస్తీర్ణంలో కోతలు పూర్తయ్యాయి. మరో 184 వేల హెక్టార్లలో పంట కోతకు సిద్ధంగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని కొన్నిచోట్ల నీటి ఎద్దడి కారణంగా పూర్తిస్థాయిలో పంటలు ఇంకా కోతలకు రాలేదు. ఈ పరిస్థితుల్లో ఆదివారం వేకువజామున ఈదరు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఏజెన్సీ గ్రామీణ ప్రాంతాలతోపాటు జిల్లాలోని కొన్ని మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లాలోని బెజ్జంకి, హుస్నాబాద్, కొమురవెల్లి, అక్కన్నపేట, కోహేడ, మిరుదొడ్డి మండలాలతోపాటు, మెదక్ జిల్లాలో అక్కడక్కడ స్వల్పంగా ఈదురు గాలులతో కూడిన జల్లులు పడ్డాయి. బెజ్జంకి మండలంలో అత్యధికంగా 4 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది.
అంతా ఇంతా కాదు..
ప్రస్తుతం పంట కోత దశకు రావడంతోపాటు ఇప్పటికే నూర్పిళ్లు చేసుకుని కల్లాల్లో ధాన్యం, చేలల్లో పనులను వదిలేసిన రైతుల పరిస్థితి దారుణంగా మారింది. గ్రామీణ ప్రాంత మండలాల్లో గత రెండ్రోజులుగా భారీస్థాయిలో వర్షపాతం నమోదవుతోంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో ఆకస్మికంగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసి ముద్ద అయ్యిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు యాంత్రీకరణ పరికరాలైన హార్వెస్టర్స్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మార్గం లేకపోవడం, ప్రభుత్వం హార్వెస్టర్స్‌ను సరఫరా చేస్తామని చెప్పినా ఆచరణలో సాధ్యం కాకపోవడంతోపాటు లాక్ డౌన్ వల్ల కూలీలు పనులకు రాకపోవడంతో ప్రస్తుత సీజన్‌లో రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం అంతా ఇంతా కాదు. ఇప్పుడు పంట చేతికి వచ్చే దశలో అకాల వర్షం అన్నదాతలకు తీరని వెతలు మిగిల్చాయి.
tags: Medak, farmers, rice, crops, rain, grain