- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వైద్యుడి నిర్లక్ష్యం నిండు గర్భిణి బలి
దిశ, నర్సంపేట టౌన్: నెలలు నిండిన ఓ గర్భిణి ఆస్పత్రిలో మృత్యువాత పడిన సంఘటన నర్సంపేట పట్టణంలోని రాజారాం ఆస్పత్రిలో చోటుచేసుకుంది. డాక్టర్ నిర్లక్ష్యం మూలంగానే గర్భిణి మృతి చెందిందని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు ఆసుపత్రి ఎదుట ధర్నా చేపట్టారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. దుగ్గొండి మండలంలోని మధిర గ్రామానికి చెందిన లావణ్యకు(24) నెక్కొండ మండలానికి చెందిన రాకేష్ రెడ్డితో గతేడాది వివాహం జరిగింది. లావణ్య ఏడు నెలల గర్భవతి.
ఇదిలా ఉండగా శనివారం ఉన్నట్టుండి నొప్పులు రావడంతో నర్సంపేటలోని రాజారాం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. లావణ్యకు చికిత్స అందించిన డాక్టర్ రాజారాం ఇది సాధారణమే అని తగ్గిపోతుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఇంజక్షన్ సైతం ఇచ్చారు. ఉన్నట్టుండి ఆదివారం ఉదయం నాలుగు గంటలకు మరోసారి నొప్పులు ఎక్కువయ్యాయి. కంగారు పడిన లావణ్య అత్తమ్మ కంపౌండర్ కి విషయం చెప్పారు. అతను ఇంజక్షన్ చేసిన కాసేపటికే లావణ్య మృతి చెందినట్లు ఆమె అత్తమ్మ రేణుక ఆరోపించింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని ఆసుపత్రి ఎదుట మృతురాలి బంధువులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.