ప్రారంభించడానికి ముందే ప్యాచ్ వర్క్ లా..?

by Sridhar Babu |   ( Updated:2021-07-09 06:56:22.0  )
rangareddy news
X

దిశ, చేవెళ్ల: అధికారుల పర్యవేక్షణ లోపం.. కాంట్రాక్టర్ స్వార్థం మూలంగా పది కాలాల పాటు పటిష్ఠంగా ఉండాల్సిన తారురోడ్డు ప్రారంభానికి ముందే గుంతలు పడింది. దీంతో ప్రారంభానికి ముందే మరమ్మతులు చేసిన ఘటన చేవెళ్ల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. చేవెళ్ల నుంచి మల్కాపూర్ వరకు తారు రోడ్డు నిర్మాణానికి గాను ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద రూ.2 కోట్ల 70 లక్షలతో ఇటీవల నిర్మాణం చేపట్టారు.

విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇదే రోడ్డును శుక్రవారం చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ప్రారంభించారు. కాగా ఈ రోడ్డు పనులు 2020 సెప్టెంబర్ ప్రారంభమై 2022 మార్చిలోపు పూర్తి చేయాలని, ఈ రోడ్డును పి.ఎల్.ఆర్ కన్స్ట్రక్షన్ వారు చేపట్టినట్లు చేవెళ్ల డివిజన్ డిప్యూటీ ఇంజనీర్ జగన్ రెడ్డి తెలిపారు. రోడ్డు ప్రారంభానికి ముందే గుంతలు పడి మరమ్మతు చేపట్టిన విషయం గురించి ప్రశ్నించగా రోడ్డు పనులు నాణ్యతగా జరిగాయని, క్వాలిటీ కంట్రోల్ అధికారులు కూడా వచ్చి తనిఖీ చేశారని వెల్లడించారు. ఢిల్లీ నుంచి కూడా రోడ్ల తనిఖీ అధికారుల బృందం వచ్చి చూశారని వివరించారు.

Advertisement

Next Story

Most Viewed