రైతులపై ప్రేమ వ‌ట్టిమాట‌లే..!

by Shyam |   ( Updated:2021-12-28 11:33:49.0  )
car
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: వ‌రి ధాన్యం కొనుగోళ్ల విష‌యంలో దేశ‌వ్యాప్తంగా పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తున్న విష‌యం విధిత‌మే. ఈ త‌రుణంలో పార్టీల‌క‌తీతంగా నేతలంద‌రూ రైతుల‌పై ప్రేమ ఒల‌క‌బోస్తుంటారు. మంగ‌ళ‌వారం రోజున తుర్క‌యంజాల్ మున్సిపాలిటీ ప‌రిధి కోహెడ‌లో అభివృద్ధి కార్య‌క్ర‌మాల ప్రారంభోత్స‌వంలో కాంగ్రెస్‌, టీఆర్ఎస్ నేత‌లు ప్ర‌వ‌ర్తించిన తీరు అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసింది. కోహెడ మున్సిప‌ల్ ఆఫీసు ద‌గ్గ‌ర రైతు ఆర‌బోసిన‌ ధాన్యంపై నేత‌లు త‌మ కార్ల‌ను నిల‌బెట్ట‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. త‌మ‌కు ఎక్క‌డా జాగ లేద‌న్న‌ట్టు తినే తిండి గింజ‌ల‌పై కాలు మోపుతూ, కార్ల‌ను నిల‌బెట్టడాన్ని అంద‌రూ త‌ప్పుప‌ట్టారు. ఫొటోల‌కు ఫోజులివ్వడ‌మే ధ్యేయ‌మ‌న్న‌ట్టు నేత‌లు ప్రవ‌ర్తించడాన్ని స్థానికులు తీవ్రంగా ఖండించారు.

leader

Advertisement

Next Story

Most Viewed