- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రౌడీ షీటర్ ఎల్లం గౌడ్ హత్య కేసులో నిందితుల లొంగుబాటు
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లాలో కలకలం రేపిన రౌడీ షీటర్ ఎల్లంగౌడ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. ఎల్లంగౌడ్‌ను తామే చంపామంటూ.. తొడేంగల వెంకటేశ్, ఎడ్ల మధుసూదన్ రెడ్డి, కాసా స్వామి అనే నిందితులు జిల్లా ఏసీపీ కార్యాలయంలో లొంగిపోయారు. పాతకక్షల కారణంగానే హత్య జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఎల్లంగౌడ్ ముఠాకు చెందిన సభ్యులే అతడిని హత్య చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పంపకాలలో వచ్చిన తేడాలు, పలు సెటిల్మెంట్‌లల్లో ఎల్లంగౌడ్ అడ్డు వస్తున్నాడన్న కారణంతో హత్య చేశారని పోలీసులు తెలిపారు. ఎల్లంగౌడ్‌ను మొత్తం ఏడుగురు కలిసి హత్య చేసినట్లు లొంగిపోయిన నిందితులు ఒప్పుకున్నారని ఏసీపీ రామేశ్వర్ స్పష్టం చేశారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. లొంగిపోయిన ముగ్గురు నిందితులను జ్యుడిషియల్ రిమాండ్‌కు పంపిస్తున్నట్లు ఏసీపీ చెప్పారు.
tag: Yellam goud murder case, accused surrendered, ACP office, Siddipet