- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'మహా' పోరుకు అంతా సిద్ధం
గ్రేటర్ పోరుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ఎన్నికల నిర్వహణకు చకచకా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. పోలింగ్ కు గడువు సమీపిస్తుండడంతో అధికారులు పనుల్లో వేగం పెంచారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా పోలింగ్, ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకుసాగుతున్నారు. సమస్యాత్మక పోలింగ్‌కేంద్రాల గుర్తింపు, కొవిడ్ నిబంధనల అమలుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. ఇప్పటికే శానిటైజేషన్చేసి బ్యాలెట్ బాక్సులను సిద్ధం చేశారు. సిబ్బంది నియామకం, 30శాతం రిజర్వ్స్టాఫ్ ను అందుబాటులో ఉంచారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద నిఘాను కట్టుదిట్టం చేసేందుకు రెడీ అవుతున్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ పోరుకు రాజకీయ పార్టీలతో పాటు అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు. మరో పది రోజుల్లో ఎన్నికలు నిర్వహించి, ఓట్ల లెక్కింపు కోసం అన్ని ఏర్పాట్లను వేగంగా చేపడుతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 9,235 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా, 48 వేల మంది సిబ్బందిని నియమించారు. వీరిలో 30 శాతం మందిని రిజర్వ్ స్టాఫ్‌గా ఉంచుకున్నారు. సమస్యాత్మక పోలింగ్ స్టేషన్ల గుర్తింపుతో పాటు పోలింగ్ ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేసేందుకు ఎన్నికల సంఘం అన్ని చర్యలు చేపడుతోంది. జీహె చ్ఎంసీ పరిధిలోని 30 సర్కిళ్లలో 150 వార్డులకు సంబంధించి డిసెంబర్ 1న ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లను వేగవతం చేశారు. ఈ సారి ఎన్ని కల్లో 74,04,286 మంది ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉండగా ఇందు కోసం 9,235 పోలిం గ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
కరోనా ప్రభావం కారణంగా దాదాపు ప్రతి వెయ్యి మందికి ఒక పోలింగ్ కేలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. పోలింగ్ కేంద్రంతో పాటు పరిసరాల్లోనూ కొవిడ్ నిబంధనలు అమలు చేసేందు కు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. పోలింగ్ నిర్వహణకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఒక్కో పోలింగ్ కేంద్రానికి నలుగురు చొప్పున 36,800 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. వీరికి అదనంగా 30శాతం సుమారు 11,060 మందిని రిజర్వ్‌లో పెట్టారు. విధుల్లో ఉన్న సిబ్బందికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడినా రిజర్వ్ స్టాఫ్‌ను అక్కడికి తరలించనున్నారు. వెయ్యికి పైగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. 25 వేలకు పైగా పోలీసులతో బందోబస్త్ ఏర్పాటు చేస్తున్నారు.
బ్యాలెట్బాక్సులు సిద్ధం..
ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన బ్యాలెట్ బాక్స్‌లను తెప్పించడంతో పాటు ఇప్పటికే శానిటైజేషన్ పూర్తి చేసినట్టు నోడల్ అధికారి యాదగిరి రావు తెలిపారు. గ్రేటర్ ఎన్నికలకు 28,500 పోలింగ్ బాక్స్‌లను తీసుకొచ్చి భద్రపరిచారు. బ్యాలెట్ బాక్స్ లను తరలించి, ఎన్నికల అనంతరం తిరిగి సేకరించుకునే విధంగా 30 డీఆర్‌సీలను ఏర్పాటు చేశారు. డిసెంబర్ 4వ తేదీన 150 కౌంటింగ్ రూముల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంతవరకూ భౌతిక దూరం అమలుతో పాటు శానిటైజేషన్, మాస్క్‌లు ధరించడం వంటి అన్ని రకాల కొవిడ్ నిబంధనలు అమలు చేయనున్నట్లు జీహెచ్ఎంసీ ఎన్నికల అథారిటీ స్పష్టం చేసింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు అభ్యర్థులు, ప్రజలు సహకరించాలని అథారిటీ కోరింది.
ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నారంటే..
ప్రస్తుత పాలక మండలి పదవీకాలం 2021 ఫిబ్రవరి 10తో ముగియనుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-యూ(3)ఏ ప్రకారం నగర పాలక సంస్థల పదవీ కాలం ముగియకముందే రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలక్షన్స్ నిర్వహించాలి. జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 7 (1) ప్రకారం జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీ కాలం ముగింపు తేదీకి ముందు మూడు నెలల నుంచి నిర్వహించాల్సి ఉంటుంది.
ఎవరెవరు ఏ పనిచేస్తారు..
రాష్ట్ర ప్రభుత్వం: వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు కేటాయింపు
రాష్ట్ర ఎన్నికల సంఘం: ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం, ముద్రించడం, రిటర్నింగ్ అధికారుల నియామకం, ఎలక్షన్ల నిర్వహణ
అభ్యర్థికి నిబంధనలు:
డిపాజిట్: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు : రూ.2,500
ఇతరులకు: రూ.5వేలు
ఎన్నికల గరిష్ఠ ఖర్చు: రూ. 5 లక్షలు
(అభ్యర్థి ఫలితాలు వెలువడిన నాటినుంచి 45 రోజుల్లోపు వివరాలను సమర్పించాలి)
కొవిడ్ నిబంధనలు..
పోలింగ్ కేంద్రాలు, పరిసరాల్లో భౌతిక దూరం పాటించాలి. అధికారులు, సిబ్బంది, ఓటర్ల మాస్క్‌లు ధరించాలి. బ్యాలెట్ బాక్స్‌లు, సామగ్రిని ఇప్పటికే శానిటైజేషన్ పూర్తి చేశారు. ఓటర్లు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.
డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలు (డీఆర్‌సీ): 30
స్ట్రాంగ్ రూం, కౌంటింగ్ రూంలు: 150
బ్యాలెట్ బాక్స్‌లు: 28,500
ఓట్ల కౌంటింగ్: 04-12-2020
పోలింగ్ నిర్వహణ
పోలింగ్ కేంద్రాలు: 9,235
పోలింగ్ సిబ్బంది : 48,000
సిబ్బంది కేటాయింపు: 36,800 (ఒక్కో పోలింగ్ కేంద్రానికి 1+3 చొప్పున)
రిజర్వ్ స్టాఫ్: 11,060 (మొత్తం సిబ్బందిలో 30శాతం )
జనరల్ పరిశీలకులు: 06
వ్యయ పరిశీలకులు: 30
అదనపు వ్యయ పరిశీలకులు: 30