దారుణం: కరోనా రోగిని కూడా వదలని కీచకుడు.. హాస్పిటల్ బెడ్ పైనే

by Sumithra |
దారుణం: కరోనా రోగిని కూడా వదలని కీచకుడు.. హాస్పిటల్ బెడ్ పైనే
X

దిశ, వెబ్ డెస్క్: ఓ వైపు కరోనాతో ఎంతో మంది చనిపోతున్నారు. అయినా మహిళలపై అఘాయిత్యాలు అనేవి ఆగడం లేదు. ఆసుపత్రులలో కరోనా రోగులను కూడా వదలని పరిస్థితి దాపరించింది. తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగిని నర్సు ఆత్యాచారం చేసిన ఘటన భోపాల్ లో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. 43 ఏళ్ల మహిళకి వారంరోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమె భోపాల్ లోని మెమోరియల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌‌లో చేరింది. అయితే తన పై సంతోష్ అహిర్‌వార్‌(40) నర్సు ఆత్యాచారంచేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిషాత్‌పురా పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. అలాగే నిందితుడిని విచారణ కోసం భోపాల్ సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా బాధితురాలి పరిస్థితి విషమించడంతో ఫిర్యాదు చేసిన రోజు సాయంత్రం ఆమె మృతి చెందింది.

Advertisement

Next Story