ఆందోళన కలిగిస్తున్న కరోనా మరణాలు

by vinod kumar |
Corona virus
X

న్యూడిల్లీ: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో పెరగుతున్నాయి. తాజాగా కరోనా మరణాల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 89,129 కరోనా కేసులు నమోదు అయ్యాయి. సెప్టెంబర్ 20 తర్వాత ఇంత పెద్దమొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. కాగా తాజాగా కరోనా బారిన పడి 714 మంది. గడిచిన ఐదు నెలల్లో కరోనా మరణాలు ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే ప్రథమం. గతంలో అత్యధిక మరణాలు సెప్టెంబర్ 15న (1169) నమోదయ్యాయి. కాగా ప్రస్తుతం మరణాల రేటు 1.32 శాతంగా ఉంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా 6,58,909 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఇవి మొత్తం కేసుల సంఖ్యలో 5.32 శాతంగా ఉంది. ఇక రికవరీ రేటు 93.36 శాతానికి పడిపోయింది.

Advertisement

Next Story

Most Viewed