- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
హైదరాబాద్ చేరుకున్న తొమ్మిదో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణకు తొమ్మిదో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఈరోజు హైదరాబాద్‌లోని సనత్‌నగర్ గూడ్స్ కాంప్లెక్స్ చేరుకుంది. ఈ రైలులో 119.45 మెట్రిక్ టన్నుల లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (ఎల్‌ఎమ్‌ఓ) 6 ట్యాంకర్లలో వచ్చింది. ఇప్పటి వరకు తెలంగాణకు తొమ్మిది ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా 774.37 మెట్రిక్ టన్నుల ఎల్‌ఎమ్‌ఓ రవాణా అయ్యింది. ఈ తొమ్మిదో ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ఒడిస్సాలోని రూర్కే నుండి ప్రారంభమై 1320 కిలో మీటర్ల మార్గాన్ని గంటకు 60 కిలోమీటర్ల సగటు వేగంతో 22 గంటల్లోనే గమ్యస్థానానికి చేరుకుంది. ఆక్సిజన్ ప్రత్యేక రైలు ఎలాంటి ఆటంకాలు లేకుండా, వేగవంతంగా రవాణా కావడానికి రైల్వే గ్రీన్ కారిడార్‌ను ఏర్పాటు చేసింది. దీంతో రైలు సజావుగా సాధ్యమైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకుంది.
భారతీయ రైల్వే ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రత్యేక గ్రీన్ కారిడార్లలో నడుపుతున్నందున అవి గమ్య స్థానానికి తక్కువ సమయంలోనే చేరుకుంటున్నాయి. వివిధ రాష్ట్రాలకు క్రయోజెనిక్ కార్గోలో సురక్షిత రవాణాకు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోబడ్డాయి. తదనుగుణంగా ఆ రైళ్ల రాకపోకలు సజావుగా సాగడానికి కావాల్సిన మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌లు గమ్యస్థానానికి సాధ్యమైనంత త్వరగా చేరుకునేలా రైల్వే శాఖ కృషి చేస్తోంది.
ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లు గమ్య స్థానాలకు సాధ్యమైనంత త్వరగా చేరేలా కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీగజానన్ మాల్యా తెలియజేశారు. ఆక్సిజన్ సరఫరా సజావుగా సాగేలా ఈ రైళ్ల రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైల్వేలోని అన్ని బృందాలు 24 గంటలు పని చేస్తున్నాయని ఆయన అన్నారు. ఈ సరఫరాకు నిర్విరామంగా కృషి చేస్తున్న రైల్వే సిబ్బందిని, అధికారులను అభినందించారు