వివాహమైన గంటలోనే.. వధువుకు దూరమైన వరుడు

by Sumithra |
వివాహమైన గంటలోనే.. వధువుకు దూరమైన వరుడు
X

దిశ ప్రతినిధి మహబూబ్ నగర్: పెళ్లి అంటే నూరెళ్ల పంట… ఎన్నో ఆశలతో వధువు అత్తగారింటిలో అడుగుపెట్టింది. నిండు నూరెళ్లు ఆనందంగా చూసుకుంటాడని అతని చేతిపట్టుకొని నడిచింది. కానీ కలకాలం తోడుంటానని ప్రమాణం చేసి కొన్ని గంటల్లోనే వధువుకు దూరమయ్యాడు వరుడు. పారానీ ఆరక ముందే ఆమె జీవితంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి అయిన కొన్ని గంటలకే వరుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

వివాహమైన కొన్ని గంటల్లోనే నవరుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. గ్రామానికి చెందిన ఆవుల సూర్య బాబు(23) అనే యువకునికి ఆదివారం ఉదయం వివాహం జరిగింది. బంధువులు మిత్రులు పెద్ద ఎత్తున తరలి వచ్చి వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి ఆనందం రాత్రికి విషాదంగా మారింది. ఇంట్లోనే ఉరి వేసుకొని వరుడు ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ ఆత్మహత్యకు గల కారణాలు వెల్లడి కాలేదు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story