- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'నక్సలైట్లకు ప్రజలే బుద్ధి చెప్పాలి'
దిశ, వరంగల్: శాంతియుతంగా ఉన్న పల్లె వాతావరణంలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్న నక్సలైట్లకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కాటారం డీఎస్పీ బోనాల కిషన్ పిలుపునిచ్చారు. నక్సలైట్ దామోదర్, వెంకటేష్, లచ్చన్న, ఆజాద్ టీంలుగా ఏర్పడి మారుపేర్లతో అడవుల్లో సంచరిస్తున్నారని వారికి ప్రజలే సరైన గుణపాఠం చెప్పాలని సూచించారు. ప్రస్తుతం ప్రజలు ముఖ్యoగా యువత అభివృద్ధిని సంక్షేమాన్ని శాంతిని కోరుకుంటున్నారు. చట్టాన్ని ఎవరు చేతిలోకి తీసుకున్నా పోలీస్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. ఇప్పటికైనా తుప్పు పట్టిన సిద్ధాంతాలను వదిలి ఆయుధాలతో సహా ప్రభుత్వం ముందు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలవాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేస్తోందన్నారు. ప్రజలు మీకు ఎవరైనా అనుమానాస్పద కొత్త వ్యక్తులు, మావోయిస్టులు కనిపిస్తే వెంటనే 100-కు కానీ సంబంధిత పోలీస్ అధికారులకు కానీ సమాచారం ఇవ్వాలని మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన తెలిపారు.