కరోనా కొత్త వేరియంట్‌పై అవగాహన, అప్రమత్తత రెండూ అవసరమే!

by Shyam |
Municipal Chairperson
X

దిశ, ఘట్కేసర్: కరోనా కొత్త వేరియంట్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ చైర్ పర్సన్ ముల్లి పావనిజంగయ్య యాదవ్ ఘట్కేసర్ పట్టణ ప్రజలకు సూచించారు. శనివారం హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ సైన్స్(ఎచ్ఐటీఎస్) కళాశాల ఆధ్వర్యంలో కరోనా థర్డ్ వేవ్(ఒమిక్రాన్), స్వచ్ఛ్ సర్వేక్షన్‌పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ.. కరోనా వైరస్ దరిచేరకుండా ఉండేందుకు ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకొని జాగ్రత్త పడాలని అన్నారు. కరోనా కొత్త వేరియంట్‌పై హిట్స్ కళాశాల వారి సహకారంతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వసంత, వైస్ చైర్మన్ మాధవ రెడ్డి, కౌన్సిలర్లు వెంకట్ రెడ్డి, రమాదేవి మహిపాల్ గౌడ్, ఆంజనేయులు గౌడ్, అనురాధా రాఘవరెడ్డి, మల్లేష్, నరేష్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు దేవేందర్ ముదిరాజ్, జంగారెడ్డి, మాజీ బ్యాంక్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, నాయకులు రహీం, విజయ్ గౌడ్, సురేష్, కళాశాల ప్రిన్సిపాల్, మరియు సిబ్బంది, విద్యార్థులు, మున్సిపల్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story