కొడుక్కి సెల్యూట్ చేసిన తల్లి.. ఆ తర్వాత ఆనందంతో ఏం చేసిందంటే

by Anukaran |   ( Updated:2021-08-21 03:29:31.0  )
కొడుక్కి సెల్యూట్ చేసిన తల్లి.. ఆ తర్వాత ఆనందంతో ఏం చేసిందంటే
X

దిశ, వెబ్ డెస్క్: ప్రతీ తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత స్థానాల్లో ఉండాలని కోరుకుంటారు. తనకంటే మంచి గొప్ప స్థాయిలో ఉండాలని ఆశిస్తూ ఉంటారు. ఆ తల్లిదండ్రులు ఆశించినట్లే తమ పిల్లలు కూడా ఆ స్థాయికి వెళ్తే వారి కళ్లల్లో ఆనందం మామూలుగా ఉండదు. అంతేకాదు తమకంటే గొప్పస్థాయిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులకు పై అధికారిగా ఆ పిల్లలు ఉంటే అంతకంటే ఆ తల్లిదండ్రులకు మించిన ఆనందం ఇంకేం ఉంటుంది చెప్పండి. ఇలాంటి ఘటనలు మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఉద్యోగరీత్యా కొడుకును తండ్రి గౌరవించడం, ఉన్నతాధికారి అయిన కూతురుకు తండ్రి సెల్యూట్ చేయడం వంటి సన్నివేశాలను చూశాం. ఆ సందర్భంలో ఆ తండ్రి అనుభవించిన ఆనందానికి అవధులు లేవనడానికి వారి కంట నుంచి వెలువడిన ఆనంద భాష్పాలే నిదర్శనం.

తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి గుజరాత్‌లో వెలుగుచూసింది. ఉన్నతాధికారి అయినా తన కొడుకు‌కు సెల్యూట్ చేస్తూ ఓ తల్లి మురిసిపోయింది. వివరాల్లోకి వెళ్తే గుజరాత్ అరవపల్లి ప్రాంత డీఎస్పీ ఆఫీస్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ మహిళా ఏఎస్ఐ తన పై ఉన్నతాధికారి అయిన డీఎస్పీకి సెల్యూట్ చేస్తుంది. అందుకు ప్రతిగా డీఎస్పీ కూడా సెల్యూట్ చేశారు. పోలీస్ ఉద్యోగంలో ఇవన్నీ సహజమే కానీ ఇక్కడొక ట్విస్ట్ ఉంది. ఏంటంటే సెల్యూట్ చేసుకున్న ఆ ఇద్దరూ తల్లీ కొడుకులు కావడం విశేషం. తల్లి మురిసిపోతూ ఉన్నతాధికారి అయిన కొడుకుకు సెల్యూట్ చేసింది. సెల్యూట్ చేస్తూ తన కళ్లల్లో ఆనందభాష్పాలు కార్చింది. అయితే ఇద్దరూ తల్లీకొడుకులు అని తెలుసుకున్న కొందరు ఆ సన్నివేశాన్ని చిత్రీకరించేందుకు ఫోన్లకు పని చెప్పారు. సెల్‌ఫోన్‌లో క్లిక్ మనిపించారు. ఈ అపురూప దృశ్యాన్ని గుజరాత్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోషల్ మీడియా‌లో పోస్ట్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్‌గా మారింది.

Advertisement

Next Story