దారుణం.. రూ. 3 వేలకు పసికందు విక్రయం

by Sumithra |
7 days baby
X

దిశ, కుత్బుల్లాపూర్: పేదరికం ఆ కుటుంబాన్ని ఎంతటికైనా తెగించేలా చేసింది. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో ఏకంగా కన్నకూతురినే విక్రయించడానికి రెడీ అయ్యింది ఓ తల్లి. ఈ ఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు, శిశు సంక్షేమ శాఖాధికారుల వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లిలోని ఉండే రాధ అనే మహిళ చెత్త ఏరుకొని జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు తీవ్రతరం కావడంతో తన ఏడు రోజుల పసికందు(కూతురు)ను బేరానికి పెట్టింది. స్థానికంగా ఉండే శాంతి అనే మహిళకు గురువారం రూ. 3 వేలకు విక్రయించింది.

అయితే శుక్రవారం ఉదయం ఆ డబ్బులు సరిపోవని, అదనంగా రూ. 10 వేలు కావాలని గొడవకు దిగడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శాంతి ఆ పసికందును తీసుకొని స్థానిక అంగన్వాడీ టీచర్ సూచన మేరకు చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు అప్పగించింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ పసికందును శిశు సంరక్షణ కేంద్రానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story