విషాదం.. తల్లీకొడుకు సజీవ దహనం

by srinivas |
Current shock
X

దిశ, వెబ్‌డెస్క్: అనంతపురం జిల్లా పెద్దప్పూర్ మండలం వరదాయపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై వెళుతున్న తళ్లీకొడుకులపై విద్యుత్ తీగలు తెగిపడటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మృతులు లక్ష్మమ్మ(55), వెంకటస్వామి(37)గా గుర్తించారు. కూలీ పని కోసం ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా విద్యుత్‌ హైటెన్షన్‌ వైర్లు తెగిపడ్డాయి. దీంతో మంటలు చెలరేగి తల్లీకొడుకులకు అంటుకొని అక్కడికక్కడే మృత్యువాతపడ్డారని పోలీసులు వెల్లడించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story