అత్యంత నిరాడంబరంగా ఐపీఎస్, డీఎస్పీ వివాహం

by srinivas |
అత్యంత నిరాడంబరంగా ఐపీఎస్, డీఎస్పీ వివాహం
X

దిశ, ఏపీ బ్యూరో: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో… మరో ఆరు నెలల పాటు వివాహ ముహూర్తాలు లేవన్న వ్యాఖ్యానాల క్రమంలో ఐపీఎస్ అధికారి, డీఎస్పీ అత్యంత నిరాడంబరం వివాహం చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ఒక రిసార్ట్‌లో ఐపీఎస్ అధికారి మణికంఠ, డీఎస్పీ హర్షితల వివాహం జరిగింది. ఈ వివాహానికి కేవలం 40 మంది బంధుమిత్రులు మాత్రమే హాజరు కావడం విశేషం. అతిథులంతా భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి జిల్లా ఎస్పీ సత్య ఏసుబాబు, సత్యసాయి ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తదితులరు హాజరు కావడం విశేషం.

Advertisement

Next Story

Most Viewed