ఉదయాస్తమాన శ్రీవారి సేవా టికెట్ ధర రూ. కోటి 

by srinivas |
tirupathi
X

దిశ, ఏపీ బ్యూరో : కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ రూ.కోటి కాగా శుక్రవారం రోజున మాత్రం రూ.1.5 కోట్లుగా నిర్ణయించింది. టీటీడీ దగ్గర 531 ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తుంది టీటీడీ. ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పించనుంది. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాపు రూ.600 కోట్ల మేర ఆదాయం రానుంది. ఉదయాస్తమాన సేవా టికెట్ల కేటాయింపుతో లభించే మొత్తాన్ని చిన్నపిల్లల ఆస్పత్రి అభివృద్ధికి కేటాయించాలని టీటీడీ పాలకమండలి ఇటీవలే నిర్ణయించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story