గవర్నర్ కోటా.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖారారు

by Anukaran |   ( Updated:2020-07-20 05:39:31.0  )
గవర్నర్ కోటా.. ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖారారు
X

దిశ, వెబ్ డెస్క్: గవర్నర్ కోటాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు వైసీపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. ఖాళీగా ఉన్న రెండు ఆ స్థానాలకు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కొయ్యే మాసేను రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన అఫ్జల్ ఖాన్ భార్య మైనా జకియా ఖానం పేర్లను ఖారారు చేస్తూ వైసీపీ ప్రకటించింది. కాగా ఎమ్మెల్సీ పదవుల భర్తీపై వైఎస్సార్‌సీపీ ఫోకస్ పెట్టిన నాటి నుంచి నేటి వరకూ, ఆశావహుల సంఖ్య పెరుగుతూ, రోజుకో పేరు తెరపైకి వచ్చింది. ఇంతటితో ఈ ప్రచారానికి తెరపడింది.

Advertisement

Next Story