- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ది మిరాకిల్’ షార్ట్ ఫిల్మ్
దిశ, వెబ్‌డెస్క్ ;
జీవితంలో అందరూ తమకు నచ్చినట్టుగా జీవించాలనే కలలు కంటారు. మంచి జాబ్, అర్థం చేసుకునే లైఫ్ పార్టనర్, అమ్మానాన్నలు, పిల్లలతో కలిసి ఎంజాయ్ చేయడంతో పాటు సమాజంలో గౌరవం. జస్ట్ ఇవి చాలు లైఫ్‌లో.. ఎక్కువేమీ కోరుకోవడం లేదని అంటారు. కానీ కోరుకున్నవి వెంటనే దొరికితే అది జీవితం ఎలా అవుతుంది.. అలా జరిగితే అసలు దేవుడు అనేవాడు గుర్తుకువస్తాడా మనిషికి? తానే ఓ దేవుడైపోడు!
అందుకే దేవుడు ఏం చేస్తాడు.. జీవితంలో మనిషి అనే వాడికి కొన్ని కష్టాలు ఇస్తాడు.. కొన్ని లక్ష్యాలు సెట్ చేస్తాడు.. అవి సాధించే బలం, పరిష్కరించే సత్తా ఇచ్చి.. చేరుకునే మార్గం మాత్రం కొంచెం కష్టతరం చేస్తాడు. ఎందుకంటే తనను గుర్తు చేసుకోవాలిగా మనుషులు. ఈ నేపథ్యంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్ “ది మిరాకిల్”.
ఊరి నుంచి సిటీకి వచ్చిన ఓ యువకుడు చాలా కష్టాలు పడుతుంటాడు. జాబ్ లేదు.. రూమ్ అద్దె కట్టేందుకు డబ్బులుండవు. తినడానికి సరైన తిండి కూడా ఉండదు. ఎవరైనా టచ్ చేస్తే ఏడుపు వచ్చేన్ని కష్టాలు మాత్రం ఉంటాయి. కానీ వాటన్నింటినీ మౌనంగా భరిస్తూ.. తాను సంతోషంగానే ఉన్నానని తల్లిదండ్రుల దగ్గర యాక్ట్ చేస్తూ జీవితాన్ని వెళ్లదీస్తూ.. ‘దేవుడా నా లైఫ్‌లో ఒక మిరాకిల్ కలిగించు’ అని కోరుకుంటాడు. ఈ క్రమంలో యువకుడు ఉదయాన్నే లేచి డోర్ ఓపెన్ చేయగానే గుమ్మంలో ఓ గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. కానీ, ఓపెన్ చేస్తే అందులో ఏమీ ఉండదు. ప్రతీ రోజు ఉదయం అలాగే జరుగుతుంది. చివరికి ఒకరోజున తనకు చిరాకు వచ్చి.. ఆ గిఫ్ట్ బాక్స్‌ను మూలకు తన్నేస్తాడు. కానీ ఆరోజే ఆ బాక్స్‌లో మిరాకిల్ సెట్ చేస్తాడు దేవుడు. ఇంతకీ ఆ మిరాకిల్ ఏంటి? దాని ద్వారా ఆ యువకుడు జీవితంలో ఏం పొందాడు? కష్టాల నుంచి విముక్తి పొందాడా? టార్గెట్ రీచ్ అయ్యాడా? ఆ గిఫ్ట్‌తో రియలైజ్ అయ్యాడా? అనేది కథ.
ఒక్క డైలాగ్ కూడా లేకుండా సైలెంట్‌గా తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ “ది మిరాకిల్”ను అనిల్ కైవల్య డైరెక్ట్ చేయగా.. అనురాగ్, శరత్ నిర్మించారు. కేవలం ఎనిమిదిన్నర నిమిషాల నిడివితో కూడిన ఈ షార్ట్ ఫిల్మ్‌లో సూపర్ మెసేజ్ ఉండగా.. అజయ్ అరసాడ మ్యూజిక్ ఫిల్మ్ ఇంటెన్సిటీని పెంచింది.