- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బాలికపై అత్యాచారం.. మూర్ఖుడు వరసకు తాతే
దిశ, సూర్యాపేట: సూర్యాపేట జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు మనుమరాలు వయసున్న చిన్నారిపై అత్యాచారం చేశారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండలం పాతర్లపహాడ్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. పాతర్లపహాడ్ గ్రామానికి చెందిన గుంజ వెంకన్న(45), అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక(వరుసకు మనుమరాలు)పై ఎలాగైనా తన కామకోరికలను తీర్చుకోవాలనుకున్నాడు. చిన్నారి తండ్రి చనిపోవడంతో తల్లి రోజువారీ కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే.. కరోనా కారణంగా ఇటీవల స్కూళ్లు మూతపడంతో తల్లి పనికి వెళ్లాక, చిన్నారి ఇంట్లో ఒంటరిగా ఉంటున్న బాలికను బెదిరింపులకు గురిచేసి గతకొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం బాలిక గర్భవతి అన్న విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంకన్న కోసం వెతకగా, పరారీలో ఉన్నట్లు తెలిసింది. దీంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.