'సార్.. మీకు థ్యాంక్స్'

by Sridhar Babu |   ( Updated:2020-05-11 03:37:56.0  )

దిశ, కరీంనగర్: ‘అవస్థలు పడుతున్న మమ్మల్ని ఆదుకున్నారు.. ఏడుస్తూ మేము మీకు ఏకరవు పెట్టగానే మమ్మల్ని ఇక్కడకు రప్పిచారు.. ఈ కష్టకాలంలో మా కన్నీరు తుడిచిన మీకు ధన్యవాదాలు సార్’ ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు.. తెలంగాణకు చెందిన వలస కూలీలు మంత్రి ఈటెల రాజేందర్ తో చెప్పిన మాటలు.

విషయమేమిటంటే..

తెలంగాణకు చెందిన కొంతమంది ముంబైకి వలస వెళ్లారు. అయితే, ప్రస్తుతం దేశమంతటా లాక్ డౌన్ కొనసాగుతున్నందున వీరంతా అక్కడే చిక్కుకుని అవస్థలు ఎదుర్కొన్నారు. చేసేందుకు పని లేక, తినేందుకు తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డారు. దీంతో వీళ్లంతా మంత్రి ఈటెలకు సమాచారమందించారు. కన్నీరుమున్నీరవుతూ తమ బాధలేంటో చెప్పుకొచ్చి, తమను ఎలాగైనా రాష్ట్రానికి రప్పించాలని వేడుకున్నారు. వెంటనే స్పందించిన మంత్రి వారిని ముంబై నుంచి సొంత ప్రాంతాలకు రప్పించారు. ఈ సందర్భంగా వారంతా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed