- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘సంత’లో సడేమియా.. అధికారులు ఇదేందయ్యా..!
దిశ, మక్తల్ : వారాంతపు సంతలో కరోనా నిబంధనలు మరిచి భౌతిక దూరం పాటించకుండా ఒకరినొకరు తోసుకుంటూ జనసందోహంగా మారింది. మక్తల్ మున్సిపాలిటీ అధికారులు బస్టాండ్ వద్దగల కూరగాయల మార్కెట్ ద్వారా వచ్చే ఆదాయంపైనే దృష్టి పెట్టారేతప్పా కరోనా నియంత్రణ గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ ప్రారంభం కాగానే సంతకు వచ్చిన జనాలు అందుబాటులో ఉన్న వాహనాల్లో కిక్కిరిసిగా స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. కానీ అరకొరగా తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు ప్రయాణీకులు లేక ఖాళీ సీట్లతో తిరుగుతున్నాయి. కరోనా నియంత్రణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తున్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
పక్క రాష్ట్రంలోని రాయచూరు జిల్లా దేవసుగూరు తాలుకాలో శనివారం ఒక్క రోజే దాదాపు రెండు వందల వరకు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని అక్కడి ప్రభుత్వం కరోనా నియంత్రణకు పూర్తిగా లాక్‌డౌన్ విధించింది. సరిహద్దు గ్రామాల్లోని జనాలు నిత్యావసరాల సరుకుల కోసం మక్తల్‌కు రావడం వల్ల జనసందోహం ఏర్పడింది. ప్రభుత్వం మినహాయించిన సమయంలో ప్రజలు ఆధిక సంఖ్యలో మార్కెట్‌కు రావడంతో కరోనా మరింతగా వ్యాప్తిచెందే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు మేల్కొని వారాంతపు సంతవల్ల వచ్చే ఆదాయంపై దృష్టి పెట్టకుండా కరోనా నియంత్రణకు కూరగాయల మార్కెట్ ను విశాలమైన స్థలాలకు తరలించాలని పలువురు కోరుతున్నారు.