- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నాలుగు దశాబ్దాలు కావస్తున్నా.. మారని అడవి బిడ్డల జీవితాలు
దిశ, వాజేడు: దట్టమైన అడవులు, కొండకోనల్లో నాగరిక ప్రపంచానికి దూరంగా బతుకుతున్న గిరిజనుల అభివృద్ధి కోసం నెలకొల్పిన సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లు వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోతున్నాయి. ఏటా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా గిరిజన ఆవాసాలు కనీస మౌలిక వసతులకు నోచుకోలేక తల్లడిల్లుతున్నాయి. ఐటీడీఏలు నెలకొల్పి మూడు దశాబ్దాలు పూర్తయినా గిరిజనుల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడ అన్న చందంగానే ఉన్నాయి. రాష్ట్రంలో ములుగు జిల్లా ఏటూరునాగారం, ఐటీడీఏలో . గ్రూప్–1 లేదా ఐఏఎస్ కేడర్ అధికారులను ప్రాజెక్టు అధికారి (పీవో)గా నియమించి వారి పర్యవేక్షణలో పథకాలను అమలు చేస్తున్నారు. విద్య, వైద్యం, ఇంజనీరింగ్, ఉద్యానవనం, ఇరిగేషన్, గిరిజన సహకార సంస్థ, పట్టుపరిశ్రమ, వ్యవ సాయం తదితర విభాగాలను ఏర్పాటు చేసి పథకాలు అమలు చేస్తు న్నారు. నిధుల లేమి, సిబ్బంది కొరత, పర్యవేక్షణ లోపం, పాలకుల పట్టింపులేనితనం, అవినీతి అక్రమాలు వంటి కారణాలతో పథకాల ఫలాలు గిరిజనులకు పూర్తిస్థాయిలో దక్కడం లేదు. గిరిజనుల కష్టాలు, వారి ఆవాసాలు అధ్వానంగా ఉన్నారు
గిరిజనుల దరిచేరని వైద్య సేవలు
గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవలు అధ్వానంగా మారాయి. ఐటీడీఏల ఆధ్వర్యంలో వైద్య విభాగం పనిచేస్తున్నా ఎక్కడా తగిన సౌకర్యాలు లేవు. డిప్యూటీ డీఎంహెచ్‌వో స్థాయి అధికారి పరిధిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్‌సెంటర్లు ఉన్నాయి. అయితే చాలాపోస్టులు ఖాళీగా ఉండడం, కొన్నిచోట్ల ఉన్నా సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల గిరిజనుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతోంది. కాంట్రాక్టు పద్ధతిన నియమితులైన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
అందని ద్రాక్షగా హక్కు పత్రాలు
అటవీ హక్కుల చట్టం–2006 ప్రకారం.. పోడు చేసుకుంటున్న గిరిజన రైతులకు భూమి హక్కు పత్రాలు ఇవ్వాలి. కానీ ఇది గిరిజనులకు అందని ద్రాక్షగానే మారింది. ఏటూరునాగారం ఐటీడీఏలో మొదటి దశ కింద 2010–11లో 14,016 మందికి 41,314.59 ఎకరాలకు హక్కు పత్రాలు జారీ చేశారు. వీఎస్‌ఎస్ కింద 134 మందికి 1,18,122 ఎకరాలకు పత్రాలు అందించారు. ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో ఎంతోమంది ఆదివాసీలు పోడు వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వారికి హక్కు పత్రాలు జారీ చేయకుండా ఫారెస్టు అధికారులతో అక్రమ కేసులు బనాయించి గిరిజనులు పోడు భూమి దూరం చేస్తున్నారు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏ ఎదుట పలుమార్లు ధర్నాలు రాస్తారోకోలు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు
సాగుకు సాయమేదీ?
ఏటూరు నాగారం పరిధిలో ఇంది ర జలప్రభ గిరి వికాస్ పథకం కింద వందల మంది మంది రైతులు పొలాల్లో బోర్లు వేసుకున్నా విద్యుత్ మోటా ర్లు, త్రీఫేజ్ కరెంటు కనెక్షన్ ఇవ్వక నిరుపయోగంగా మారాయి. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా తాడ్వాయి, మంగ పేట, ఏటూరునాగారం, కొత్తగూడ, గూడూరు, గోవిందరావుపేట మండలాలకు నాలుగేళ్ల కిందట రూ.55.45 కోట్లతో చెక్‌డ్యాం పనులు మంజూరైనా నిర్మాణానికి నోచుకోలేదు. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఆర్థిక చేయూత ఏదీ?
గిరిజనులకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ప్రవేశపెట్టిన ‘ఎకనామికల్ సపోర్ట్ స్కీం’ (ఈఎస్‌ఎస్) వారిని ఏమాత్రం ఆదుకోవడం లేదు. ఈ పథకం కింద స్వయం ఉపాధి కోసం కిరాణాలు, జిరాక్స్ సెంటర్లు, టెంట్‌హౌజ్‌లు, ఫొటో స్టూడియోలు, బుక్‌స్టాళ్లు, చికెన్ సెంటర్, వాహనాలు ఇస్తుంటారు. రైతులకు దుక్కిటెద్దులు, మేకలు, గొర్రెల పెంపకం, పాడి గేదెల యూనిట్లు మంజూరు చేస్తారు. అలాగే ట్రాక్టర్లు, వ్యవసాయ పనిముట్లు, వ్యవసాయ బోర్లు, కరెంట్ మోటార్లు, పైపులైన్లు అందజేస్తారు. ఏటా వందల సంఖ్యలో యూనిట్లు కేటాయిస్తున్నా.. వాటిలో సగం కూడా గ్రౌండింగ్ చేయకుండా సంవత్సరాల తరబడి పెండింగ్ పెడుతున్నారు. పట్టు పరిశ్రమలు నిర్వీర్యం అయ్యాయి ట్రైకార్ యాక్షన్ ప్లాన్‌లో ప్రభుత్వం ఏటా నిధులు మంజూరు చేస్తున్నా.. ఐటీడీఏ ఖర్చు చేయడం లేదు. పట్టు పరిశ్రమ విభాగం ప్రధాన కార్యాలయం చెన్నూరుకు తరలిపోయింది. ఏటూరునాగారంలో పట్టుగూళ్ల పెంపకం పూర్తిగా బంద్ అయ్యింది.
దశాబ్దాలుగా అభివృద్ధి శూన్యం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ఏటా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. గిరిజన గ్రామాల్లో విద్య, వైద్యంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించిననాడే అభివృద్ధి సాధ్యం. ఐటీడీఏలు ఏర్పాటు చేసి నాలుగు దశాబ్దాలు కావస్తున్నా గిరిజనుల అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగానే ఉందంటే పాలకుల చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోందని . పలు గిరిజన సంఘాల ఆరోపిస్తున్నాయి
- Tags
- fortest area
- ITDA