కేరళలో లెఫ్ట్ లీడింగ్

by Shamantha N |
కేరళలో లెఫ్ట్ లీడింగ్
X

తిరువనంతపురం: కేరళలో లెఫ్ట్ కూటమి రికార్డు బద్దలు చేయడానికి సిద్ధమైంది. వరుసగా రెండో సారి అధికారాన్ని చేపట్టే అవకాశాలను మెరుగుచేసుకుంటూ నాలుగు దశాబ్దాల రికార్డును బ్రేక్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 140 స్థానాల్లో ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగాయి. 140 స్థానాల్లో ప్రస్తుతం అధికార ఎల్‌డీఎఫ్ కూటమి 93 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. కాంగ్రెస్ 45 స్థానాల్లో ముందంజలో ఉన్నది.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 47 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. 2016లో ఎల్‌డీఎఫ్ 91 స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా, వీటికన్నా ఎక్కువ సీట్లను గెలుపొందనున్నట్టు ఫలితాల అంచనాలు తెలుపుతున్నాయి. కాగా, శబరిమల అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేసుకున్న బీజేపీ మాత్రం ఒక్కస్థానంలోనే ఆధిక్యాన్ని కలిగి ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ ఒకే స్థానానికి పరిమితమైన సంగతి తెలిసిందే. 1982లో రాష్ట్రంలో అధికారంలోని యూడీఎఫ్ మరోసారి మెజార్టీని సాధించింది. అప్పటి నుంచి ఈ రెండు కూటములు ప్రతి ఐదేళ్లకోసారి అధికారాన్ని చేజిక్కించుకోవడం లేదా కోల్పోవడం జరుగుతూ వస్తున్నది. తాజాగా, ఎల్‌డీఎఫ్ నాలుగు దశాబ్దాల రికార్డును బద్దలు కొట్టి రెండోసారి వరుసగా అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశమున్నట్టు తెలుస్తున్నది.

Advertisement

Next Story

Most Viewed