మహారాష్ట్ర సీఎంపై కర్ణాటక సీఎం ఫైర్

by Anukaran |   ( Updated:2021-01-18 07:55:15.0  )
మహారాష్ట్ర సీఎంపై కర్ణాటక సీఎం ఫైర్
X

బెంగళూరు: మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను మహారాష్ట్రలో కలుపుకుంటామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యెడియూరప్ప మండిపడ్డారు. ఆయన వ్యాఖ్యలు దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నాయని అన్నారు. ప్రాంతీయ, భాషల గురించి మాట్లాడి దేశ ఐక్యతకు భంగం కలిగిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో మరాఠాలు నివసిస్తున్నట్టే మహారాష్ట్రలోనూ కన్నడిగులు స్థానికులతో కలిసి జీవిస్తున్నారన్నారు. సరిహద్దు వివాదాలపై మహాజన్ కమిషన్ సిఫారసులను ఉభయ రాష్ట్రాలూ అంగీకరించాయని, మళ్లీ పాత వివాదాలను తెరమీదకు తేవడం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, కనీసం ఆయన దేశ సమాఖ్య స్ఫూర్తినైనా గౌరవించాలని సూచించారు.

Advertisement

Next Story