అతడు రొమాన్స్ లో దిట్ట

by Shyam |   ( Updated:2021-08-30 10:15:50.0  )
photo
X

దిశ, సినిమా : బీటౌన్ లెజెండరీ యాక్టర్స్ ధర్మేంద్ర, శత్రుఘ్న సిన్హా.. ఇటీవలే కపిల్ శర్మ షోకు హాజరై సందడి చేశారు. ఇందులో తమ ఫ్రెండ్‌షిప్ గురించి ఎన్నో విషయాలు రివీల్ చేయడంతో పాటు ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ ఆసక్తి కలిగించారు. ఈ మేరకు పర్సనల్ లైఫ్‌ సీక్రెట్లను బయటపెట్టుకున్న క్లోజ్ ఫ్రెండ్స్.. తమ బ్రొమాన్స్, ఫ్రెండ్లీ నేచర్‌తో ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ పంచారు. ఈ మేరకు ధర్మేంద్రను ‘బాద్‌షా ఆఫ్ రొమాన్స్’గా వర్ణించిన సిన్హా.. ‘బ్యూటిఫుల్ లేడీస్‌తో రొమాన్స్ చేయడంలో నేర్పరి’ అంటూ కితాబిచ్చాడు. ఇక హోస్ట్ కపిల్.. ఈ సీనియర్ యాక్టర్స్ యంగర్ డేస్‌కు సంబంధించిన పిక్చర్స్ చూపించినపుడు లేట్ దిలీప్ కుమార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నాడు ధర్మేంద్ర. బిగ్ స్క్రీన్‌పై ఆయన సినిమాలు చూసే హీరో కావాలని కలలు కన్నట్లు చెప్పుకొచ్చాడు.

కాగా 1954లో పంతొమ్మిదేళ్లకే ప్రకాశ్ కౌర్‌ను పెళ్లి చేసుకున్న ధర్మేంద్ర.. నలుగురు పిల్లలు పుట్టిన తర్వాత హీరోయిన్ హేమ మాలినికి అట్రాక్ట్ అయ్యాడు. జంటగా అనేక సినిమాల్లో నటించిన వీరు చివరకు 1980లో ఒక్కటయ్యారు. అయితే ధర్మేంద్ర రెండో పెళ్లి చేసుకున్నప్పటికీ ఫస్ట్ వైప్ ప్రకాశ్ కౌర్.. అతడి నిర్ణయాన్ని వ్యతిరేకించకపోగా సమర్థించడం గమనార్హం. తన భర్తను ఉమెనైజర్ అని పిలవడం పట్ల బాలీవుడ్ జనాలకు ఘాటుగానే సమాధానమిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed