- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కరోనా కాటుకు బలైన మరో జర్నలిస్టు
దిశ, నాగార్జునసాగర్: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మరీ ముఖ్యంగా జర్నలిస్టులపై పంజా విసురుతోంది. రోజూ అనేకమంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడుతుండగా పరిస్థితి విషమించి పలువులు మృతిచెందుతున్నారు. తాజాగా.. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గ టీవీ9 జర్నలిస్టు గోపిని బలి తీసుకుంది. ఇటీవల కరోనా బారినపడిన ఆవుల గోపి హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. దీంతో నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వర్గాల్లో విషాదచాయలు అలుముకున్నాయి.
కాగా, కరోనా సెకండ్ వేవ్‌లో ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు మృతిచెందగా మరో జర్నలిస్టు మృతి మీడియా వర్గాల్లో కలకలం రేపుతోంది. కరోనా మహామ్మారిని ఎదుర్కొనేందుకు ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా కొనసాగుతున్న వారిలో మరణాలు సంభవిస్తుండటం ఆందోళన కల్గిస్తున్న అంశంగా మారింది.