- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పిన హైదరాబాద్ యువతి..
దిశ, పటాన్‌చెరు: ఇప్పటికే 13 గిన్నిస్ రికార్డులు సాధించిన, గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థిని శివాలి జోహ్రీ శ్రీవాస్తవ మరో ఎనిమిది గిన్నిస్ రికార్డులు లక్ష్యంగా మంగళవారం భారీ ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఆమె తల్లిదండ్రులు కవితా జోహ్రీ శ్రీవాస్తవ, అనిల్ శ్రీవాస్తవ లతో కలిసి ఆరెగామీ పేపర్‌తో రూపొందించిన 2000 నెమళ్ళు, 1600 కుక్కలు, 5500 బూరెలు, 6000 నిమ్మతొనలు, 20000 చేపలు, 7000 వేల్స్‌తో పాటు 4000 క్విల్లింగ్ దేవదూతలు, 3200 క్విల్లింగ్ బొమ్మలను ఒకేచోట ఉంచి, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రదర్శనగా రికార్డు నెలకొల్పారు.
ఆరెగామీ కాగితంతో రూపొందించిన వాటిని తయారు చేయడం ఒక ఎత్తయితే, వాటన్నింటినీ ఒకేచోట ప్రదర్శనగా పెట్టడం మరో ఎత్తు. గీతం గణితశాస్త్ర విభాగ ప్రొఫెసర్ డి.మల్లిఖార్జున రెడ్డి వాటిని లెక్కించి అధికారికంగా ధ్రువీకరించారు. గీతం డెరైక్టర్లు స్వతంత్ర న్యాయ నిర్ణేతలుగా ఈ ప్రదర్శనను స్వయంగా తిలకించి, ధ్రువీకరించిన పత్రాలను గిన్నిస్ అధికారులకు పంపి, వారి ఆమోదం తరువాత రికార్డును ఖరారు చేయనున్నారు.