- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
40 లక్షల ఏళ్ల కిందటి మానవ జాతి ఆనవాళ్లు?
దిశ, ఫీచర్స్: పురాతన చరిత్రను వెలికితేసేందుకు శాస్త్రవేత్తలు తమ పరిశోధనలు కొనసాగిస్తూనే ఉంటారు. ఈ క్రమంలో వందల, వేల సంవత్సరాల నాటి జంతువుల ఆనవాళ్లతో పాటు అప్పటి మానవుల ఆచార వ్యవహారాలు బయటపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా ఇజ్రాయిల్‌కు చెందిన పరిశోధకులు.. భూమిపై నివసించిన మొట్టమొదటి మానవుని ఉనికిని వెల్లడించే ఆధారాలు కనుగొన్నారు. అయితే ఇందుకు సంబంధించిన విషయాలను పరిశోధనాత్మకంగా కనుగొనాల్సిన అవసరం ఉంది.
ఇజ్రాయిల్, రామ్లాలోని జెరూసలేం హిబ్రూ యూనివర్సిటీ ఆర్కియాలజిస్టుల బృందం తవ్వకాలు చేపట్టారు. ఇందులో కనుమరుగైన మానవ సంతతికి చెందిన పుర్రెలు, దవడలు బయటపడ్డట్టు ఓ స్టడీ పేర్కొంది. అయితే గతంలో బయటపడ్డ మానవుల ఎముకలు, పుర్రెలతో ఇవి సరిపోలలేదు. జర్నల్ సైన్స్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ఆంథ్రపాలజిస్ట్, ఆర్కియాలజిస్ట్ యోషి జైట్నర్.. అక్కడ దొరికిన వస్తువులను ‘నేచురల్ రామ్లా హోమో’గా వర్గీకరించారు. కాగా రామ్లా సిటీలో చివరగా మానవ జాతి 40వేల సంవత్సరాల నుంచి 12లక్షల ఏళ్ల కిందట నివసించి ఉండొచ్చని రీసెర్చర్స్ నమ్ముతున్నారు.
ఆదిమ మానవ జాతికి ప్రస్తుత మానవులతో పోలిక ఉండదని విశ్లేషకులు అంటున్నారు. దవడ, పుర్రె నిర్మాణం భిన్నంగా ఉంటుందని, వారు పొడవైన దంత నిర్మాణాన్ని కలిగి ఉంటారని చెబుతున్నారు. ఇక రామ్లాలో అయితే మానవ అవశేషాలతో పాటు జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు కూడా పరిశోధకులు కనుగొన్నారు. కాగా తూర్పున దొరికిన కొన్ని శిలాజాలు.. నజరేత్ రామ్లా జాతీయుల వలెనే ఉన్నాయని తెలిపారు. అయితే అధ్యయన ప్రారంభ దశలోనే ఉన్నందున, ఈ పురాతన అవశేషాల గురించి ముందస్తుగా వెల్లడించడం సరికాదన్నారు. ఆవిష్కరణ వివాదాస్పదమైనప్పటికీ.. ఐరోపా, ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించిన మానవ శిలాజాల మధ్య సారూప్యతను ఇది అంచనా వేసింది.