ఐలమ్మ చరిత్రను రికార్డు చేయాలి: సీఎం కేసీఆర్

by  |
ఐలమ్మ చరిత్రను రికార్డు చేయాలి: సీఎం కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఐలమ్మ చరిత్రను కూడా రికార్డు చేయాలని సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రగతి భవన్ లో గురువారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ కుటుంబ సభ్యులు సీఎంను కలిశారు. తెలంగాణ వీరనారి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారంగా నిర్వహించాలని నిర్ణయించినందుకు కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఐలమ్మ కుటుంబానికి సంబంధించిన వివరాలు మరిన్ని కావాలని అన్నారు.

ఐలమ్మ కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చాకే ఐలమ్మకు తగిన గుర్తింపు, గౌరవం దక్కిందన్నారు. వర్ధంతి, జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్ కు రుణపడి ఉంటామన్నారు. సీఎంను కలిసిన వారిలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అరూరి రమేశ్ తదితరులతో పాటు ఐలమ్మ కుటుంబ సభ్యులు పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం, కుమారుడు చిట్యాల సంపత్ , చిట్యాల శ్వేత మనుమడు, మనుమరాళ్లు ఉన్నారు.

Advertisement

Next Story