ఒక్క ప్రశ్నకు కూడా సరైన సమాధానం లేదు.. హైకోర్టు ఆగ్రహం

by Anukaran |   ( Updated:2021-06-01 03:40:11.0  )
Telangana High Court
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నివేదికపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెంగాణలో కరోనా కట్టడి చర్యలపై హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ సందర్భంగా హెల్త్ డైరెక్టర్ సమర్పించిన నివేదికపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘మేం అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు సరైన సమాధానం రాలేదు. రేపటి విచారణకు హెల్త్ సెక్రటరీ, డీహెచ్, డీజీపీలు అందరూ హాజరు కావాలి. కొవిడ్ చికిత్స ధరలపై కొత్త జీవో ఇవ్వలేదు. కరోనాపై సలహా కమిటీ ఏర్పాటు చేయలేదు. థర్డ్ వేవ్‌పై ఇప్పటివరకూ సమీక్ష చేయలేదు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సూచనలు చేయలేదు. మేం అడిగిన ఒక్క అంశానికి కూడా సరైన సమాధానం లేదు. రేపు హెల్త్ సెక్రటరీ, డీహెచ్, డీజీపీలు దీనిపై పక్క వివరణ ఇవ్వాలి. థర్డ్ ప్రారంభమై మహారాష్ట్రలో 8 వేల మంది చిన్నారులకు కరోనా సోకింది. థర్డ్ వేవ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అన్ని భవిష్యత్తులోనే చేస్తారా? ఇప్పుడేం చేయలేరా?. లైసెన్సు రద్దు చేసిన ఆసుపత్రుల బాధితులకు సొమ్ము తిరిగి ఇచ్చారా?.’’ అని తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరి దీనికి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed