- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరీ ఇంత దారుణమా, ఆ డబ్బులు ఏం చేస్తున్నారు?.. హైకోర్టు సీరియస్
దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. హైదరాబాద్నగరంలోని గోల్కొండ, కుతుబ్ షాహీ టూంబ్స్ నిర్వహణ తీరుపై హైకోర్టు ఫైర్ అయ్యింది. రాష్ట్రంలో చారిత్రక కట్టడాలను పరిరక్షించే తీరు ఇదేనా అని ప్రభుత్వాలను ప్రశ్నించింది. గోల్కొండ, కుతుబ్ షాహీలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయని.. గతేడాది అక్టోబరులో పత్రికల్లో ప్రచురితమైన వార్తల ఆధారంగా హైకోర్టు పిల్ స్వీకరించింది.
ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. గోల్కొండ, కుతుబ్ షాహీ టూంబ్స్ వద్ద విద్యుత్ దీపాలు కూడా సరిగా లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశ విదేశాల పర్యటకులు వచ్చే ప్రాంతాలను పట్టించుకోక పోవడం బాధాకరమని హైకోర్టు ఆవేదన వ్యక్తపరిచింది.
చారిత్రక కట్టడాల నిర్వహణ, మరమ్మతులకు నిధులు ఎన్ని కేటాయించారు. పర్యటకుల నుంచి వచ్చే సందర్శన ఛార్జీలు ఎంత వసూలు చేశారు? తదితర వివరాలన్నీ రెండు వారాల్లో సమర్పించాలని ఆదేశించింది. ఏప్రిల్ 15న విచారణకు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, రాష్ట్ర పర్యటక శాఖ ముఖ్య కార్యదర్శి హాజరై వివరణ ఇవ్వాలని తెలిపింది.