- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కోర్ట్ చెప్పినా వినని అధికారులు.. అయోమయంలో వ్యాపారులు..
దిశ, ఎల్బీనగర్: గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ వ్యాపారులు బాటసింగారం తరలి వెళ్లడానికి హైకోర్టు మరో నెల రోజులు గడువు ఇచ్చింది. కోర్టుకు కమిషనర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి వేర్వేరుగా సమర్పించిన నివేదికల ప్రకారం బాటసింగారంలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించలేదని తేలింది. ప్రభుత్వం నెలలోగా పనులు పూర్తి చేయాలని కోర్ట్ ఆదేశించింది. కొహెడలోని 178 ఎకరాల్లో శాశ్వత ప్రాతిపదికన సౌకర్యాలు కల్పించాలంది. గడ్డి అన్నారం మార్కెట్ తరలింపును సమర్థిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై మార్కెట్ కమీషన్ ఏజెంట్లు దాఖలు చేసిన అప్పీళ్లపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఏ. రాజశేఖరరెడ్డిలతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. అయితే ఈ నెలరోజులు వ్యాపారులు బాటసింగారంలో కొత్తగా ఏర్పాటు చేసిన మార్కెట్‌లో గాని, గడ్డి అన్నారం మార్కెట్‌లో గాని వ్యాపారం నిర్వహించుకోవచ్చని కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది. ఇచ్చిన హామీ మేరకు నెల రోజుల్లోగా బాటసింగారంలో సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కోర్ట్ ఆర్డర్ భేఖాతర్..!
బాట సింగారంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో సౌకర్యాలు కల్పించే వరకు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లో వ్యాపారం నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టమైన ఆర్డర్ ఇచ్చింది. అయినా కోర్టు ఉత్తర్వులను అధికారులు భేఖాతర్ చేస్తూ పండ్ల మార్కెట్‌లోకి అనుమతించకపోవడంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోర్టులపై కూడా నమ్మకం పోయే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
జరిమానా విధించినా మారని తీరు..
కేసు న్యాయస్థానం పరిధిలో ఉండగా.. కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా వ్యాపారులను మార్కెట్‌లోకి అనుమతించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మార్కెట్ కమిటీ చైర్మన్ ముత్యంరెడ్డి, కార్యదర్శి పి. హర్షలకు రూ. 2 వేల జరిమానా విధించింది. బాటసింగారంలో ప్రభుత్వం సౌకర్యాలు కల్పించే వరకు ఎక్కడైనా వ్యాపారం నిర్వహించుకోవచ్చని స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినా అధికారులు గడ్డి అన్నారం పండ్ల మార్కెట్‌లోకి అనుమతించకుండా అడ్డుకుని.. మరోసారి హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించారు.