మరియమ్మ లాకప్ డెత్‌.. హైకోర్టు కీలక స్టెప్

by Shyam |   ( Updated:2021-11-26 00:36:43.0  )
High Court
X

దిశ, వెబ్‌డెస్క్ : మరియమ్మ అనే దళిత మహిళ పోలీసుల కస్టడీలో మరణించిన సంఘటన రాష్ట్రంలో పెను దుమారం లేపింది. దళిత సంఘాలు, విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ ఘటనలో పోలీస్ అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుపై ఇంకా విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో మరియమ్మ లాకప్ డెత్ కేసును హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అంతే కాకుండా మరియమ్మ కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం, పోలీసుల వాదనలు విని తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed