- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏడ్చిన సాయి పల్లవి
అందం, అభినయంతోనే కాకండా.. మాటలతోనూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది హీరోయిన్ సాయి పల్లవి. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కలిసి నటించిన ‘ఫిదా’ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడి తన నటనతో తెలుగు ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. అంతేకాదు సినిమాలను ఎంచుకోవడంలో కూడా తన స్టైలే వేరు. పాత్రకు తగ్గట్టు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా ఈ భానుమతి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగులో ‘విరాట పర్వం’ అనే సినిమాను చేస్తోంది. ఈ సినిమాను వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. రానా హీరోగా చేస్తున్నారు. తెలంగాణ నేపథ్యంలో పీరియాడికల్ ప్రేమకథగా, రాజకీయ థ్రిల్లర్‌గా వస్తోంది. రానా రాజకీయ నాయకుడిగాను, సాయిపల్లవి పేదింటి యువతిగా కనిపించనున్నది అనేది సమాచారం. అంతే కాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సాయి పల్లవి నాగ చైతన్యతో కలిసి నటిస్తోంది. ఈ క్రమంలో సాయి పల్లవి మీడియాతో మాట్లాడుతూ… తనకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఒక వేళ నటి కాకుంటే ఏం చేసుండే వారని అడగ్గా.. సాయి పల్లవి స్పందిస్తూ.. ఎంబీబీఎస్ తరవాత కార్డియాలజీ ఎంచుకుని కార్డియాలజీస్ట్ అయ్యేదాన్నని తెలిపింది. ఎవరికి తెలియని విషయం చెప్పండని అడగ్గా.. మాది తమిళనాడులోని బడుగ అనే గిరిజన తెగ. మా భాష బడుగకు లిపి లేదని సమాధానం ఇచ్చింది. ఇక ఎప్పుడైన ఏడ్చారా.. అని ప్రశ్నించగా.. హీరో సూర్యతో కలిసి నటించిన ఎన్జీకే సినిమా సమయంలో ఒకే సీన్‌ను పదే పదే రీషూట్ చేస్తుండేవారు దీంతో ఒకరోజు సినిమాలను వదిలేస్తానని అమ్మకు చెప్పి ఇంట్లో ఏడ్చేశాను అని చెప్పింది.
Tags : heroine Sai Pallavi, wept, NGK MOVIE, rana, surya, naga chaithanya, seen