- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దారుణం: యువతి రెండో పెళ్లి చేసుకుందని.. ఆమెను అలా చేసి
దిశ, వెబ్ డెస్క్: కంప్యూటర్ యగంలో కూడా మూఢనమ్మకాలనేవి తగ్గడం లేదు.. నూతన టెక్నాలజితో ప్రపంచం ఎంతో దూసుకపోతుంది. అయినా ఈ మూఢనమ్మకాలు మాత్రం ప్రజలను వదలడం లేవు. అబ్బాయి ఎన్ని పెళ్లిలు చేసుకున్నా తప్పుకాదు.. కానీ ఓ అమ్మాయి రెండో పెళ్లి చేసుకుంటే దానికంటే పెద్ద తప్పులేదన్నట్టు చూస్తారు ఈ పెద్దలు. తాజాగా మహారాష్ట్రలోని అకోలా జిల్లా వాడ్గావ్ గ్రామంలో ఓ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. జలగాం జిల్లాలోని నాత్ జోగి సామాజిక వర్గానికి చెందిన బాధిత 35 ఏళ్ల మహిళ 2011లో తొలి వివాహం చేసుకుంది. అయితే భర్తతో ఏర్పాడిన వివాదాల కారణంగా ఆమె తన భర్తకి విడాకులు ఇచ్చి రెండో వివాహం చేసుకుంది.
అయితే కొన్ని రోజుల తర్వాత ఈ విషయం ఆఊరి పెద్దలకు తెలిసింది. దీంతో ఆగ్రహానికి లోనైన ఈ ఊరి పెద్దలు రెండో పెళ్లి చేసుకున్న ఆమె తన కులానికి చెందిన వ్యక్తుల ఉమ్మిని నాకాలనీ అలాగే లక్షరూపాయిల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. రెండో వివాహం చేసుకున్న తనను పంచాయితీకి ఈడ్చి తానేదో పెద్ద నేరం చేసినట్లుగా శిక్ష విధించటాన్ని ఆమె భరించలేకపోయింది. పంచాయితీ పెద్దల తీర్పును ధైర్యంగా ఎదిరించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. జలగాం జిల్లాకు చెందిన బాధిత మహిళ ఫిర్యాదుపై చోప్డా సిటీ పోలీసులు ఈ కేసును మే 13న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కానీ ఈ ఘటన అకోలా జిల్లాలో జరగడంతో కేసును పింజార్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.