కరోనా కట్టడికి ప్రభుత్వం 24 గంటలు పని చేస్తుంది : ఈటల

by Sridhar Babu |
కరోనా కట్టడికి ప్రభుత్వం 24 గంటలు పని చేస్తుంది : ఈటల
X

దిశ,హుజురాబాద్: కరోనా వైరస్ ను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు పనిచేస్తుందని, ప్రతి ఒక్కరూ ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించి కరోనా కట్టడికి సహకరించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం హుజురాబాద్ మండలంలోని కందుగుల గ్రామంలోని హైస్కూల్లో కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను ప్రారంభించారు. అనంతరం తుమ్మనపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడాతూ… వివిధ డివిజన్లు ఏర్పాటు చేసి కంటికి రెప్పలా ప్రతి పనిని పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఇంజెక్షన్లు, వ్యాక్సిన్ ల కొరత లేకుండా బ్లాక్ మార్కెట్ కు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టి ఇప్పటికే మూడు నుంచి నాలుగు లక్షల డోసులను తయారు చేసుకోవడం జరిగిందన్నారు.

మే 1 నుంచి 18 సంవత్సరాల పైబడి వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు. రాత్రి పూట కర్ఫ్యూతో కరోనా వైరస్ కొంతవరకు నియంత్రించగలగుతున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ ప్రభావం ఎక్కువగా లేదని, పట్టణ ప్రాంతాల్లోనే ప్రభావం ఉందన్నారు. గత వారం రోజులుగా వైరస్ నియంత్రణలోనే ఉందన్నారు. ఈ ఒరవడి ఇలాగే కొనసాగితే త్వరలోనే వైరస్ తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎంపీపీ ఇరుమల్ల రాణి, తుమ్మనపల్లి సింగిల్ విండో చేర్మన్ కౌరు సుగుణాకర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story