- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇది సరే.. కానీ, వాళ్లేరీ?
దిశ నల్లగొండ: కరోనా కారణంగా రైతులకు పలు ఇబ్బందులు తలెత్తాయి. చేతికొచ్చిన పంట ఏమవుతుందోనని ఆందోళన చెందారు. దీంతో ప్రభుత్వం ముందుకొచ్చి కొనుగోలు చేసేందుకు సిద్ధమై.. కసరత్తు చేస్తోంది. కానీ, అందుకోసం హమాలీ కొరత వెంటాడే అవకాశముంది. దీంతో అధికారులంతా తలలు పట్టుకుంటున్నారు. అదేంటో మీరే.. చూడండి… ఈ ప్రత్యేక కథనంలో..
ఆరుగాలం కష్టపడిన అన్నదాతల పాలిట కరోనా తీవ్ర ప్రభావం చూపుతున్నది. చేతికొచ్చిన పంటను అమ్ముకునేందుకు ఆందోళన పడుతున్న క్రమంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్‌డౌన్ శాపంగా మారిందని భావిస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో రైతులకు బాసటగా నిలిచేందకు సర్కార్ సిద్ధపడింది. వ్యవసాయ మార్కెట్లు బంద్ చేసిన క్రమంలో అధైర్యపడొద్దని రైతులకు భరోసా కల్పిస్తున్నది. రెవెన్యూ గ్రామాల ప్రాతిపదికన యాసంగి ధాన్యం కొనడానికి ఏప్రిల్ 2 నుంచి ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాలను తెరువడానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. ప్రతి గింజ కొనుగోలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే సర్కార్ చేస్తున్న ఈ కసరత్తుకు హమాలీ కొరత వెంటాడనుంది. స్థానిక యువత సపోర్టు తీసుకోవాలని సర్కార్ సూచించినప్పటికీ యువత ఎంత మేరకు ముందుకు వస్తారనేదీ ప్రశ్నార్థకంగా మారడంతో ఐకేపీ, పీఏసీఎస్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు.
8.89 లక్షల ఎకరాల్లో వరి సాగు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నాగర్జున్‌సాగర్, ఏఎమ్మార్పీ, డిండి, ఎస్ఆర్ఎస్పీ, మూసీ కాలువలతో పాటు 71 మండలాల్లో సాధారణ విస్తీర్ణానికి మించి ఈ రబీ సీజన్‌లో రైతులు వరిని సాగు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8 లక్షల 89 వేల 125 ఎకరాలను సాగు చేయగా 18 లక్షల 85 వేల 278 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని వ్యవసాయ అధికారుల అంచనా వేశారు. మొన్న కురిసిన వడగండ్ల వానలకు ఉమ్మడి జిల్లాలో సుమారు 25 వేల ఎకరాల నష్టం వాటిల్లింది. ప్రకృతి కన్నెర్ర చేయకపోతే దిగుబడి మరో 10 వేల మెట్రిక్ టన్నల వరకు పెరిగేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఈసారి పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని ఆనందంలో ఉన్న రైతంగానికి కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ పిడుగుపాటిగా మారింది. పట్టణాలకు ధాన్యాన్ని తీసుకువచ్చే పరిస్థితులు లేకపోవడంతో డీఆర్‌డీఏ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రెవెన్యూ గ్రామానికి ఒకటి చొప్పున ధాన్యం కొనుగోలు చేసేందుకు సర్కార్ సన్నద్ధం చేస్తోన్నది. ఈ క్రమంలో 996 ఐకేపీ, పీఏసీసీఎస్ కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ 1 నుంచి ప్రారంభించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
యాదాద్రిలో 3.94 మెట్రిక్ టన్నుల దిగుబడి
యదాద్రిభువనగిరి జిల్లాలో లక్షా 8 వేల 895 మంది రైతులు ఒక లక్షా 98 వేల ఎకరాల్లో వరిని సాగు చేశారు. 3 లక్షల 94 వేల 318 మెట్రిక్ టన్నుల ధాన్యాం దిగుబడి వస్తోందని అంచనా. వాస్తవానికి మొదట జిల్లాలో 2 లక్షల 93 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి ఉండొచ్చని వేసిన అంచనాకు భిన్నంగా దిగుబడి గణనీయంగా పెరిగిందని ఆనందపడే సమయంలో కరోనా వైరస్ కంగారు పెట్టిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. మూడు లక్షల 55 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గాను 96 ఐ కే పి, 181 పి ఏ సి యస్ అంటే మొత్తం 277 కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోన్నారు. ప్రస్తుతానికి నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యానికి సరిపడ 25 లక్షల 10 వేల గన్ని బ్యాగులు సిద్దంగా ఉన్నాయి.
కల్లాల వద్దనైనా కొనుగోలుకు సిద్ధం
నల్లగొండ జిల్లాలో 3 లక్షల 16 వేల 125 ఎకరాల్లో వరిని సాగు చేశారు. 5 లక్షల 96 వేల 960 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుంది. మంత్రి జగదీష్ రెడ్డి చేసిన సూచనకు అనుగుణంగా అధికారులు జిల్లాలో కొనుగోలు కేంద్రాలను నాలుగు తరగతులుగా విభజించారు. అధిక పంట దిగుబడి అయ్యే వాటిల్లో అంటే 20 వేల మెట్రిక్ టన్నుల పైబడి ధాన్యం వచ్చేవిగా భావిస్తున్న 14 మండలాలు, మధ్యస్తంగా దిగుబడి వచ్చే(10 వేల మెట్రిక్ టన్నుల పైబడి) వాటిల్లో 7 మండలాలుగా గుర్తించిన అధికారులు ఐదువేల మెట్రిక్ టన్నుల పై బడి దిగుబడివచ్చే వాటిల్లోఉన్న రెండు మండలాలు పోను మిగితా ఎనిమిది మండలాలను ఐదు వేల లోపుగా గుర్తించారు. అందులో భాగంగానే జిల్లాలో మొత్తం 31 మండలాల పరిధిలోని 844 గ్రామ పంచాయతీలలో రేవెన్యూ గ్రామలుగా గుర్తించిన 563 లలో 236 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలనుకున్న ప్రభుత్వం కరోనా వైరస్ నేపథ్యంలో ఆ సంఖ్యను 340 కి పెంచింది. రవాణా సౌకర్యం ఉండి రైతులు సమిష్టిగా ఒక్క దగ్గరకు చేర గలిగితే కల్లాల వద్ద సైతం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సంకల్పిస్తున్నది.
కృష్ణా, గోదావరితో కళకళ
సూర్యాపేట జిల్లాలోని 21 మండలాల్లో 3.75 లక్షల ఎకరాల్లో వరిని సాగు చేశారు. నాగర్జున్‌సాగర్ ఒకవైపు.. మరో వైపు ఎస్సా ఆర్ఎస్పీ కాలువల్లో నీళ్లు రావడంతో గోదావరి, కృష్ణా జలాలతో బీడు భూములు సస్యశ్యామలం అయ్యాయి. దీంతో సాధారణ విస్తీర్ణంకు మించి వరి సాగు గణనీయంగా పెరిగింది. 9.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి కానుంది. ఇందుకోసం 195 ఐకేపీ, 95 పీఏసీఎస్ కేంద్రాలు కలిపి మొత్తం 279 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందకు అధికారులు సన్నద్ధం చేస్తోన్నారు. కాగా, నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదంటున్నారు అధికారులు. తేమ కొలిచే యంత్రాలతోపాటు టార్ఫాలిన్లు, గన్ని బ్యాగులను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రతి కేంద్రానికి ఒక ట్యాబ్ ద్వారా ఐడి పాస్ వర్డ్ అందజేసి మిల్లర్స్, రైతులకు అనుసంధానం చేయనున్నారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించేందుకు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు ధాన్యం రాకుండా చెక్ పోస్ట్ లలో భద్రత కట్టుదిట్టం చేయనున్నారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ లాక్‌డౌన్ నేపథ్యంలో తలెత్తే హమాలీ కొరతను తీర్చడమే ఇప్పడు అధికారుల ముందున్న సవాల్!
Tags : nalgonda, Grain, Purchasing Centers, Officers, Hamali Cooli, Minister Jagadish Reddy